Telugu Global
Cinema & Entertainment

వివాదం లో ఇరుక్కున్న విష్ణు సినిమా

వరుస డిజాస్టర్ లను అందుకున్న మంచు విష్ణు గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడో విడుదల కావాల్సిన మంచు విష్ణు ‘ఓటర్’ సినిమా ఇన్నాళ్లకు విడుదలకు సిద్ధం అవుతోంది. ఒక నెల క్రితం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. కానీ ఆ తర్వాత మళ్లీ ఈ సినిమా పేరు వార్తల్లో వినిపించలేదు. అయితే తాజాగా ఒక వివాదంలో ఇరుక్కొని ఈ సినిమా వార్తల్లోకి ఎక్కింది. […]

వివాదం లో ఇరుక్కున్న విష్ణు సినిమా
X

వరుస డిజాస్టర్ లను అందుకున్న మంచు విష్ణు గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడో విడుదల కావాల్సిన మంచు విష్ణు ‘ఓటర్’ సినిమా ఇన్నాళ్లకు విడుదలకు సిద్ధం అవుతోంది.

ఒక నెల క్రితం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. కానీ ఆ తర్వాత మళ్లీ ఈ సినిమా పేరు వార్తల్లో వినిపించలేదు.

అయితే తాజాగా ఒక వివాదంలో ఇరుక్కొని ఈ సినిమా వార్తల్లోకి ఎక్కింది. మంచు విష్ణు ఈ చిత్ర దర్శకుడిని కోటిన్నర రూపాయలు ఇమ్మని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

అసలు కథలోకి వస్తే విష్ణు నటించిన ‘ఓటర్’ సినిమా కథ మోహన్ బాబు నటించిన ‘అసెంబ్లీరౌడీ’ కథకు దగ్గరగా ఉంటుందట. ‘అసెంబ్లీ రౌడీ’ సినిమా మంచు విష్ణు హోం బ్యానర్ పైన నిర్మించబడింది.

ఈ నేపథ్యంలో స్క్రీన్ ప్లే ను వాడుకున్నందుకు గాను దర్శకుడు కార్తీక్ మంచువిష్ణు కి కోటిన్నర రూపాయలు ఇవ్వాల్సిందిగా కాంట్రాక్ట్ ఉందట. కానీ ఇప్పుడు కార్తీక్ ఆ డబ్బులు ఇవ్వడానికి వెనకాడుతున్నట్లు గా విష్ణు అండ్ టీం ఆరోపిస్తోంది.

మరో వైపు దర్శకుడు కార్తీక్ మంచు విష్ణు స్వయంగా ‘అసెంబ్లీరౌడీ’ స్క్రీన్ ప్లే ని ఈ సినిమాలో వాడమని అడిగాడని, అలాగే కథ, స్క్రీన్ ప్లే లో క్రెడిట్స్ కూడా అడిగాడని ఆరోపిస్తున్నారు. మరి ఈ వివాదానికి ఎప్పుడు తెర పడుతుందో చూడాలి.

First Published:  2 May 2019 10:34 PM GMT
Next Story