ప్రెగ్నెన్సీ రూమర్స్ పై రియాక్ట్ అయిన నటి

‘ఖైదీ నంబర్ 150’ సినిమాలో ‘రత్తాలు రత్తాలు’, పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలో ‘తోబ తోబ’ వంటి ఐటెం సాంగ్ లలో కనిపించిన రాయ్ లక్ష్మి టాలీవుడ్ లో కంటే బాలీవుడ్ పైనే ఎక్కువ దృష్టి పెట్టింది.

ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు సినిమాలకు ఎందుకు దూరం అయ్యారని అడగగా ఇతర భాష సినిమాలతో బిజీగా ఉండటం వల్ల తెలుగులో నటించడం కుదరలేదని చెప్పింది.

ఇక తన బాలీవుడ్ సినిమా ‘జూలీ 2’ గురించి మాట్లాడుతూ “నాకు వాళ్ళు చెప్పిన కథ వేరు సినిమా లో చూపించింది వేరు. నా పాత్రను వ్యాంప్ గా చూపించటంతో కుటుంబ ప్రేక్షకులు సినిమా చూడటానికి ఆసక్తి చూపలేదు” అని చెప్పుకొచ్చింది రాయి లక్ష్మి.

ఇక ఐటెం సాంగుల గురించి మాట్లాడుతూ సినిమాలో రెండున్నర గంటల సేపు హీరోయిన్ గా కనిపించినా రాని క్రేజ్ ఐటెం సాంగ్ లో ఐదు నిమిషాలు కనిపిస్తే వస్తుందని… అంతేకాక రెమ్యూనరేషన్ కూడా ఎక్కువ వస్తుందని…. కాబట్టి వాటిని అంగీకరించాల్సి వస్తుందని చెప్పింది రాయ్ లక్ష్మి.

ఇక ఆమె ప్రెగ్నెంట్ అనే రూమర్లపై రియాక్ట్ అవుతూ “కొందరు నిజాలు తెలుసుకోకుండా పుకార్లు పుట్టిస్తుంటారు. కానీ నా జీవితంలో ఎఫైర్లకు స్థానం లేదు. గతంలో నేను మూడు సార్లు ప్రేమ విషయంలో మోసపోయాను. నా తప్పు తెలుసుకొని రిలేషన్ షిప్స్ ను కట్ చేశాను. ప్రస్తుతం నా దృష్టి సినిమాల పైనే ఉంది” అని క్లారిటీ ఇచ్చింది రాయ్ లక్ష్మి.