‘విరాట పర్వం’…. వార్నింగ్ ఇచ్చిన సాయి పల్లవి

ఈమధ్యనే ‘పడి పడి లేచే మనసు’ అనే సినిమాతో డిజాస్టర్ అందుకున్న ‘ఫిదా’ బ్యూటీ సాయి పల్లవి తాజాగా రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న ‘విరాటపర్వం 1992’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

‘నీది నాది ఒకే కథ’ దర్శకుడు వేణు ఊడుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి ఈ చిత్రం షూటింగ్ ఈపాటికి మొదలవ్వాల్సింది. కానీ ప్రీ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో సినిమా షూటింగ్ కూడా వాయిదా పడుతూ వస్తోంది.

ఇదే సాయి పల్లవి కి కోపం తెప్పించిందట. నిజానికి ఈమె ఈ సినిమా కోసం ఎక్కువ డేట్లను ముందుగానే ఇచ్చేసింది. కానీ ఇప్పుడు సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో సాయి పల్లవి మిగతా సినిమాలకు డేట్లు అడ్జె‌స్ట్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుందట. ఇప్పటికే కొన్ని సినిమాలకు ఇచ్చిన డేట్లను మళ్లీ రీ షెడ్యూల్ చేయాల్సి వచ్చిందట.

అందుకే ‘విరాట పర్వం’ చిత్రబృందానికి సాయి పల్లవి ఒక గట్టి వార్నింగ్ ఇచ్చిందట. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ చిత్రం షూటింగ్ మొదలు పెట్టాలని సాయి పల్లవి గట్టిగానే చెప్పిందట. సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాలో టబు, ప్రియమణి ముఖ్యపాత్ర ల్లో కనిపించబోతున్నారు.