మణిరత్నం దర్శకత్వం లో అమలాపాల్

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం తన తదుపరి చిత్రానికి సంబందించిన కార్యక్రమాల్లో బిజీ గా ఉన్నాడు. ఆయన ఎప్పటి నుండో వేచి చూస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టాడు. పొన్నియిన్ సెల్వన్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా లో మణిరత్నం పెద్ద కాస్టింగ్ ని ఇన్వాల్వ్ చేయనున్నాడు.

భారీ బడ్జెట్ తో పెద్ద స్కేల్ మీద ఈ సినిమాని తీయనున్నారు దర్శక నిర్మాతలు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం మణిరత్నం జియో స్టూడియోస్ తో చేతులు కలిపారు.

ఇప్పటికే ఈ సినిమా లో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, కీర్తి సురేష్, విజయ్ సేతుపతి, కార్తీ, జయం రవి కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలిసింది.

అయితే తాజా వార్తల ప్రకారం ఈ సినిమా లో ప్రముఖ దర్శకుడు విజయ్ మాజీ భార్య అమలా పాల్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తుందట. అమలా పాల్ ప్రస్తుతం తన నిర్మాణం లో జరుగుతున్న సినిమా తో బిజీ గా ఉంది. ఈ తరుణం లో ఈ పెద్ద ప్రాజెక్ట్ లో అవకాశం రావడం తో చాలా సంతోషంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక వివరాలు త్వరలో వెల్లడి అయ్యే అవకాశం ఉంది.