Telugu Global
National

బీజేపీలో మోడీ వ్యతిరేక బ్యాచ్ పని మొదలుపెట్టిందా?

భారతీయ జనతా పార్టీలో మోడీ వ్యతిరేక బ్యాచ్ పని మొదలుపెట్టిందా? ఇన్ని రోజులూ కామ్‌గా ఉండిన మోడీ వ్యతిరేక వర్గాలు ఇప్పుడు తమ హవాను చెలాయించే పరిస్థితి వచ్చిందా? గత ఐదేళ్లుగా పార్టీకి తిరుగులేదు. పార్టీలో మోడీకి తిరుగులేదు! జనాల్లో మోడీకి బ్రహ్మాండమైన పాపులారిటీ. ఆ పరిస్థితిని ఉపయోగించుకుని అమిత్ షాను కూడా తన పక్కనే పెట్టుకుని మోడీ ఒక ఆట ఆడుకున్నారు. ఎంతలా అంటే.. పార్టీలోని కురవృద్ధ నేతలు కూడా మోడీకి, అమిత్ షాకు వ్యతిరేకంగా […]

బీజేపీలో మోడీ వ్యతిరేక బ్యాచ్ పని మొదలుపెట్టిందా?
X

భారతీయ జనతా పార్టీలో మోడీ వ్యతిరేక బ్యాచ్ పని మొదలుపెట్టిందా? ఇన్ని రోజులూ కామ్‌గా ఉండిన మోడీ వ్యతిరేక వర్గాలు ఇప్పుడు తమ హవాను చెలాయించే పరిస్థితి వచ్చిందా? గత ఐదేళ్లుగా పార్టీకి తిరుగులేదు. పార్టీలో మోడీకి తిరుగులేదు! జనాల్లో మోడీకి బ్రహ్మాండమైన పాపులారిటీ. ఆ పరిస్థితిని ఉపయోగించుకుని అమిత్ షాను కూడా తన పక్కనే పెట్టుకుని మోడీ ఒక ఆట ఆడుకున్నారు.

ఎంతలా అంటే.. పార్టీలోని కురవృద్ధ నేతలు కూడా మోడీకి, అమిత్ షాకు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేదు. మోడీ, అమిత్ షాలు ఏం చెబితే దానికి అంతా గంగిరెద్దుల్లా తల ఆడించాల్సిందే. అదీ బీజేపీలో సాగిన రాజకీయం.

కొత్త కొత్త రూల్స్ తెచ్చారు. పార్టీలో తమకు ఎదురు చెబుతారనే సీనియర్లందరినీ పక్కన పెట్టేశారు. కొందరికి బలవంతంపు రిటైర్మెంట్ ఇచ్చారు.

ఇలా ఎలా పడితే అలా ఆడి బీజేపీని తమ చేతుల్లోకి తీసేసుకున్నారు మోడీ, షాలు.

గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ మోడీని తిరుగులేని శక్తిగా మార్చింది. అయితే ఇప్పుడు అంత మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీనే నిలిచినా అప్పటిలా సీట్లు వచ్చే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు. బీజేపీ కనీసం నలభై యాభై సీట్లను లాస్ అవుతుందనే అంచనాలున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో కమలం పార్టీలో మోడీ, షాల వ్యతిరేకులు తమ పని మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది.

‘పార్టీకి పూర్తి మెజారిటీ రాని పక్షంలో.. మోడీ మళ్లీ ప్రధాని కాలేకపోవచ్చు..’ అంటూ సుబ్రమణ్యస్వామి సన్నాయి నొక్కులు నొక్కడం అందుకు నిదర్శనమే అని వారు అంటున్నారు.

మోడీకి ప్రత్యామ్నాయ నేత పేరును కూడా స్వామి చెప్పేశారు. ‘నితిన్ గడ్కరీ..’ అని స్వామి అన్నారు. మోడీకి గడ్కరీ సమానుడు అనేశారు సుబ్రమణ్యస్వామి. తద్వారా.. ఏం చెప్పదలుచుకున్నారో క్లియర్ గానే అర్థం అవుతూ ఉందని పరిశీలకులు అంటున్నారు!

First Published:  3 May 2019 10:45 PM GMT
Next Story