కథల వేటలో రాఘవేంద్ర రావు?

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పటి టాప్ దర్శకుడు రాఘవేంద్ర రావు ‘నమో వెంకటేశ’ సినిమా తరువాత మళ్లీ సినిమాల వైపు చూడలేదు. గత కొంతకాలంగా దర్శకత్వానికి దూరంగా ఉంటున్న ఈ దర్శకేంద్రుడు ఇప్పుడు మళ్ళీ మెగా ఫోన్ పట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఆయన స్నేహితులైన కీరవాణి, సత్యానంద్ లాంటివారు రాఘవేంద్ర రావు తో ఎలాగైనా ఒక సినిమా తీయించాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకే రాఘవేంద్రరావు మళ్లీ సినిమాల వైపు చూడాలని అనుకుంటున్నాడట.

ప్రస్తుతం రాఘవేంద్ర రావు మంచి కథ కోసం వెతుకుతున్నాడట. ఇప్పటికే యువ దర్శకుల నుంచి సీనియర్ రైటర్ ల వరకు చాలామంది ఆయనకు కథలు వినిపిస్తున్నారట.

తాజాగా బి వి ఎస్ ఎన్ రవి ‘పెళ్లి సందడి’ టైప్ లో ఒక కథ చెప్పాడట. ఆ కథ రాఘవేంద్రరావు కు కూడా బాగా నచ్చిందట. అంతకంటే మంచి కథ దొరుకుతుందో లేదో అని ఎదురుచూస్తున్నాడట.

పూర్తిగా కొత్త నటీనటులతో ఈ సినిమా తెరకెక్కించాలని రాఘవేంద్ర రావు ప్లాన్ చేస్తున్నాడట. కథ ఓకే అవగానే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన బయటకు రావచ్చు.