Telugu Global
NEWS

మంత్రులకు ఓటమి తప్పదా..!

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు వస్తుందంటున్నారు. వారి వారి నియోజక వర్గాల్లో కీలకంగా వ్యవహరించిన మంత్రులు కొందరు ఈసారి పరాజయం పాలయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దీనిని ముందే పసిగట్టిన మంత్రులు పోలింగ్ ముగిసిన తర్వాత ఎవరూ ఎలాంటి ప్రకటనలు చేయటం లేదని చెబుతున్నారు. “ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు సైలెంట్ గా ఉండటం వెనుక వారికి పరాజయం తప్పదని అన్నట్లుగా తెలుస్తోంది” అని రాజకీయ విశ్లేషకులు ఒకరు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులకు […]

మంత్రులకు ఓటమి తప్పదా..!
X

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు వస్తుందంటున్నారు. వారి వారి నియోజక వర్గాల్లో కీలకంగా వ్యవహరించిన మంత్రులు కొందరు ఈసారి పరాజయం పాలయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దీనిని ముందే పసిగట్టిన మంత్రులు పోలింగ్ ముగిసిన తర్వాత ఎవరూ ఎలాంటి ప్రకటనలు చేయటం లేదని చెబుతున్నారు.

“ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు సైలెంట్ గా ఉండటం వెనుక వారికి పరాజయం తప్పదని అన్నట్లుగా తెలుస్తోంది” అని రాజకీయ విశ్లేషకులు ఒకరు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులకు ఓటమి తప్పదని, దానికి కారణం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులేనని చెబుతున్నారు.

ఓటమి పాలు కాక తప్పదని చెబుతున్న ఈ మంత్రులు తమ హయాంలో చేసిన అవినీతి కారణంగానే పరాజయం పాలయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

విజయనగరం జిల్లాకు చెందిన ఓ మంత్రి ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలో చేరి మంత్రి పదవి తీసుకున్నారు. ఇలా పార్టీ మారడాన్ని ఓటర్లు జీర్ణించుకోలేకపోతున్నారని, తాను ఎందుకు పార్టీ మారుతున్నానో నియోజకవర్గ ఓటర్లకు బహిరంగంగా తెలియజేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెబుతారు.

ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులు వారు పోటీ చేస్తున్న నియోజక వర్గాలలో తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు. వీరిలో ఒకరు స్థానికుడు కాకపోవడం కూడా వీరి ఓటమికి కారణం గా కనబడుతోంది.

ఇక కృష్ణ, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తమ ఓటమి ఖాయమని తెలిసిన ఈ జిల్లాలకు చెందిన ఒకరిద్దరు మంత్రులు సమీక్షల పేరుతో అధికార దర్పాన్ని ప్రదర్శించాలనుకుంటున్నారని, తమ శాఖలకు చెందిన అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు.

రాయలసీమ జిల్లాలకు చెందిన మంత్రులదీ ఇదే పరిస్థితి. అనంతపురం, కడప జిల్లాలకు చెందిన మంత్రులు వారి నియోజక వర్గాల్లో విజయం సాధించడం కష్టం అని చెబుతున్నారు.

దీనిని గమనించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిరంతరం సమీక్షలంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  3 May 2019 9:28 PM GMT
Next Story