Telugu Global
NEWS

పరాజయ సమీక్షలు ఎందుకు బాబు?

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విచిత్ర పరిస్థితిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగి 20 రోజులు దాటింది. ఫలితాలు వెలువడేందుకు మరో 20 రోజుల సమయం ఉంది. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు పార్టీ జయాపజయాలపై వివిధ నియోజకవర్గాల అభ్యర్థులు, సీనియర్ నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. కొన్నిసార్లు నేరుగా ను, మరికొన్నిసార్లు వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా ఈ సమావేశాలు జరిపారు. 20 రోజుల్లో ఇప్పటివరకు ఏడెనిమిది సార్లు ఈ సమావేశాలు […]

పరాజయ సమీక్షలు ఎందుకు బాబు?
X

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విచిత్ర పరిస్థితిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగి 20 రోజులు దాటింది. ఫలితాలు వెలువడేందుకు మరో 20 రోజుల సమయం ఉంది.

ఈ సమయంలో చంద్రబాబు నాయుడు పార్టీ జయాపజయాలపై వివిధ నియోజకవర్గాల అభ్యర్థులు, సీనియర్ నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. కొన్నిసార్లు నేరుగా ను, మరికొన్నిసార్లు వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా ఈ సమావేశాలు జరిపారు.

20 రోజుల్లో ఇప్పటివరకు ఏడెనిమిది సార్లు ఈ సమావేశాలు నిర్వహించినట్లుగా పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ సమావేశాలన్నింటిలోనూ పార్టీ పరాజయం పాలు కాక తప్పదని అభ్యర్థులు, సీనియర్ నాయకులు కూడా తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు.

అయినా చంద్రబాబు నాయుడు మాత్రం తమదే విజయం అంటూ పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. వీటిని బలపరిచేందుకు అన్నట్లుగా సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు.

తాజాగా శనివారం నుంచి వారం రోజులపాటు తెలుగుదేశం పార్టీ సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు. శనివారం నుంచి మూడు రోజులపాటు సమీక్షలు నిర్వహించి ఆ తర్వాత రెండు రోజులు ఎన్నికల ప్రచారం కోసం పశ్చిమ బెంగాల్ వెళ్తారు చంద్రబాబు.

తొలి మూడు రోజులు రాజమహేంద్రవరంతో సహా అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తారని చెబుతున్నారు. అయితే ఈ సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారంటూ అభ్యర్థులు, సీనియర్ నాయకులు తమలో తాము చర్చించుకుంటున్నట్లుగా సమాచారం.

శాసనసభ ఎన్నికలలో ఓటమి పాలవడం ఖాయమని తేలిపోయినట్లు గా చెబుతున్న ఈ సమయంలో తమను మభ్య పెట్టాలనుకోవడం చంద్రబాబు నాయుడు కొత్త ఎత్తుగడ గా చెబుతున్నారు. కౌంటింగ్ సమయంలో ఎలా ప్రవర్తించాలి, ఎంత జాగ్రత్తతో ఉండాలి అనేది చెప్పేందుకే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు.

ఇప్పటివరకు ఎన్నో ఎన్నికల కౌంటింగ్ లను చూసిన పార్టీ సీనియర్ నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలకు కొత్తగా ఇలా చేయాలని చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ఎన్నికలు జరిగినప్పటి నుంచి నేటి వరకూ చంద్రబాబు నాయుడు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారని సీనియర్ నాయకులు వాపోతున్నారు. పరాజయం పాలు కాక తప్పదు అనుకుంటున్న సమయంలో సమీక్షలు విజయాన్ని తీసుకు వస్తాయా..? అని వారు ప్రశ్నిస్తున్నారు.

First Published:  3 May 2019 9:38 PM GMT
Next Story