Telugu Global
Cinema & Entertainment

సందీప్ రెడ్డి అవుట్, త్రివిక్రమ్ ఇన్ ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25 వ చిత్రం మహర్షి పనులతో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా ఈ నెల 9 న భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ఈ సినిమా అనంతరం, మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక కొత్త చిత్రం చేయనున్నాడు. ఈ సినిమా కి ఇంకా పేరు ఖరారు చేయలేదు. అయితే సందీప్ రెడ్డి వంగా తో గీత ఆర్ట్స్ నిర్మాణం లో ఒక సినిమా ఉంటుంది […]

సందీప్ రెడ్డి అవుట్, త్రివిక్రమ్ ఇన్ ?
X

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25 వ చిత్రం మహర్షి పనులతో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా ఈ నెల 9 న భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ఈ సినిమా అనంతరం, మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక కొత్త చిత్రం చేయనున్నాడు. ఈ సినిమా కి ఇంకా పేరు ఖరారు చేయలేదు.

అయితే సందీప్ రెడ్డి వంగా తో గీత ఆర్ట్స్ నిర్మాణం లో ఒక సినిమా ఉంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు సడన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ లైన్ లో కి వచ్చే లా ఉన్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి చిత్రాన్ని పూర్తి చేసే సమయానికి మహేష్-అనిల్ రావిపూడి సినిమా చివరి అంకం లో ఉంటుంది. ఆ సమయాన్ని వినియోగించుకోని త్రివిక్రమ్ మహేష్ కోసం అనుకుంటున్న కథ కి మెరుగులు దిద్దే పని లో ఉంటాడట.

ఇటీవలే చాలా కాలం తర్వాత ఇద్దరూ కలిసి ఒక యాడ్ కి పని చేశారు. అప్పుడే ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడుకున్నారట. ఇక అతడు, ఖలేజా లాంటి సినిమాలతో వచ్చిన వీళ్లు ఏ ప్రాజెక్ట్ తో వస్తారో చూడాలి.

First Published:  4 May 2019 6:10 AM GMT
Next Story