Telugu Global
Cinema & Entertainment

ఎట్టకేలకు నిర్మాతగా మారుతున్న బన్నీ?

సొంతంగా సినిమా తీయాలనే ఆలోచన బన్నీకి ఎప్పట్నుంచో ఉంది. ఇప్పటికే పలు వ్యాపారాలు చేస్తున్న ఈ హీరో, నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు. తన ఇంట్లోనే గీతాఆర్ట్స్ లాంటి భారీ సంస్థ ఉన్నప్పటికీ తనకంటూ ప్రత్యేకంగా ఓ నిర్మాణ సంస్థ ఉండాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే సొంతంగా ఆఫీస్ కూడా తెరిచాడు. త్వరలోనే నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించబోతున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే సుకుమార్ సినిమాతో బన్నీ నిర్మాతగా మారే అవకాశాలు పుష్కలంగా […]

ఎట్టకేలకు నిర్మాతగా మారుతున్న బన్నీ?
X

సొంతంగా సినిమా తీయాలనే ఆలోచన బన్నీకి ఎప్పట్నుంచో ఉంది. ఇప్పటికే పలు వ్యాపారాలు చేస్తున్న ఈ హీరో, నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు. తన ఇంట్లోనే గీతాఆర్ట్స్ లాంటి భారీ సంస్థ ఉన్నప్పటికీ తనకంటూ ప్రత్యేకంగా ఓ నిర్మాణ సంస్థ ఉండాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే సొంతంగా ఆఫీస్ కూడా తెరిచాడు. త్వరలోనే నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించబోతున్నాడు.

అన్నీ అనుకున్నట్టు జరిగితే సుకుమార్ సినిమాతో బన్నీ నిర్మాతగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బన్నీ ఓ సినిమాకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఈనెల 11న ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో సహ-నిర్మాతగా చేరే ఆలోచన చేస్తున్నాడు అల్లు అర్జున్.

అటు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా బన్నీని సహ-నిర్మాతగా చేర్చుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే, ప్రస్తుతం వీళ్లు భారీ బడ్జెట్ సినిమాలు తీయడం తగ్గించేశారు. అన్నీ మోడ్రన్ బడ్జెట్ లోనే చేస్తున్నారు. రంగస్థలం తర్వాత వీళ్లు చేస్తున్న పెద్ద సినిమా ఇదే. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ పెట్టడం కంటే, బన్నీని నిర్మాతగా చేర్చుకోవడం బెటరని వీళ్లు భావిస్తున్నారట. ప్రస్తుతానికైతే చర్చలు సాగుతున్నాయి. 11వ తేదీన ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

First Published:  5 May 2019 5:51 AM GMT
Next Story