Telugu Global
Cinema & Entertainment

అమలాపాల్ ను.... ఇప్పుడు ఇలా టార్గెట్ చేశారు....

అటు తమిళంలోనే కాక తెలుగులో కూడా మంచి పాపులారిటీ ఉన్న హీరోయిన్లలో అమలాపాల్ కూడా ఒకరు. ఈ మధ్యనే ఆమె బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పై చేసిన కామెంట్ల వల్ల వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. ఆ వార్తలు ఇంకా చల్లారలేదు కానీ అప్పుడే అమలాపాల్ మరొకసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ సారి తన ప్రమేయం లేకుండా తనపై అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అమలాపాల్ తాజాగా […]

అమలాపాల్ ను.... ఇప్పుడు ఇలా టార్గెట్ చేశారు....
X

అటు తమిళంలోనే కాక తెలుగులో కూడా మంచి పాపులారిటీ ఉన్న హీరోయిన్లలో అమలాపాల్ కూడా ఒకరు. ఈ మధ్యనే ఆమె బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పై చేసిన కామెంట్ల వల్ల వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. ఆ వార్తలు ఇంకా చల్లారలేదు కానీ అప్పుడే అమలాపాల్ మరొకసారి వార్తల్లోకి ఎక్కింది.

ఈ సారి తన ప్రమేయం లేకుండా తనపై అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అమలాపాల్ తాజాగా ఫొటోల తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పసుపు రంగు క్రాప్ టాప్, గ్రే కలర్ స్కర్ట్ లో అమలాపాల్ చాలా అందంగా కనిపిస్తోంది.

“నేను ఏమి అవ్వాలి అనుకున్నా అవ్వవచ్చు అని వాళ్ళు చెప్పారు. ఇవాళ నేను ఒక హ్యాపీ మ్యాంగో” అని క్యాప్షన్ పెట్టి తన ఫొటో షేర్ చేసింది అమల. తన టాప్ ఎల్లో కలర్ కావడంతో ఆమె తనను తాను మ్యాంగో గా సంభోదించుకుంది.

కానీ దీనిపై నెటిజన్లు మాత్రం తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. కొందరైతే అసభ్య కరమైన కామెంట్లు చేస్తూ ఆమెను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. కానీ అమలా మాత్రం వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోంది.

First Published:  5 May 2019 2:16 AM GMT
Next Story