Telugu Global
Cinema & Entertainment

సెక్యూరిటీ గార్డ్ పై విరుచుకుపడిన బిగ్ బాస్ బ్యూటీ !

ఈమె తెలుగులో లో కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించినప్పటికీ అప్పటిదాకా రాని క్రేజ్ బిగ్ బాస్ సీజన్ 2లో కనిపించగానే వచ్చేసింది. ఆ షో తో ఆమె పాపులర్ అయింది. తాజాగా ఈమె శ్రీనగర్ కాలనీలోని ఒక కాఫీ షాప్ లో చేసిన రాద్ధాంతం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. హైదరాబాద్ లోని శ్రీ నగర్ కాలనీ మెయిన్ రోడ్డు మీద ఒక కాఫీ షాప్ ఉంది. ఆ కాఫీ షాప్ సెక్యూరిటీ గార్డ్ […]

సెక్యూరిటీ గార్డ్ పై విరుచుకుపడిన బిగ్ బాస్ బ్యూటీ !
X

ఈమె తెలుగులో లో కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించినప్పటికీ అప్పటిదాకా రాని క్రేజ్ బిగ్ బాస్ సీజన్ 2లో కనిపించగానే వచ్చేసింది. ఆ షో తో ఆమె పాపులర్ అయింది.

తాజాగా ఈమె శ్రీనగర్ కాలనీలోని ఒక కాఫీ షాప్ లో చేసిన రాద్ధాంతం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. హైదరాబాద్ లోని శ్రీ నగర్ కాలనీ మెయిన్ రోడ్డు మీద ఒక కాఫీ షాప్ ఉంది. ఆ కాఫీ షాప్ సెక్యూరిటీ గార్డ్ తో ఆమె గొడవ పడింది. పార్కింగ్ గురించి అతనిపై విరుచుకుపడింది. ఆమె కార్ ను పార్కింగ్ ఏరియా లో పార్క్ చేసి లోపలి కి వెళ్లి వచ్చేసరికి అక్కడ ఆమె కారు తీయడానికి అడ్డంగా మరొక రెండు కార్లు పెట్టి ఉన్నాయట.

ఈ విషయంలో చిరాకు తెచ్చుకున్న ఆమె సెక్యూరిటీ గార్డుపై మండిపడింది. దీనితో ఆగకుండా సెక్యూరిటీ గార్డ్ మరియు మిగతా స్టాఫ్ కి పార్కింగ్ ఎలా ఉండాలి అనే విషయంపై పెద్ద క్లాస్ పీకిందట.

ఈ విషయమై సోషల్ మీడియాలో ఆమెను కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఆమెకు పార్కింగ్ బావుండాలి అనుకుంటే జూబ్లీహిల్స్ లాంటి పాష్ ఏరియాలకు వెళ్లకుండా శ్రీనగర్ కాలనీ లాంటి బిజీ ఏరియాల్లోకి ఎందుకు రావడం అని ఆమెను తిట్టిపోస్తున్నారు.

First Published:  5 May 2019 12:13 AM GMT
Next Story