Telugu Global
NEWS

ఐపీఎల్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో ఆఖరాట

సూపర్ సండే ఫైట్లో ముంబైతో కోల్ కతా ఢీ చెన్నైతో కింగ్స్ పంజాబ్ సమరం మొహాలీలో 4 గంటలకు, ముంబైలో 8 గంటలకు షో దేశంలోని కోట్లాదిమంది అభిమానులను గత ఆరువారాలుగా ఓలలాడిస్తూ వస్తున్న ఐపీఎల్ 12వ సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పోటీలు ముగింపు దశకు చేరాయి. సూపర్ సండే డబుల్ ధమాకాగా జరిగే పోటీలకు మొహాలీలోని పంజాబ్ క్రికెట్ సంఘం స్టేడియం, ముంబైలోని వాంఖెడీ స్టేడియం వేదికలుగా నిలిచాయి. మొహాలీలో సాయంత్రం 4 […]

ఐపీఎల్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో ఆఖరాట
X
  • సూపర్ సండే ఫైట్లో ముంబైతో కోల్ కతా ఢీ
  • చెన్నైతో కింగ్స్ పంజాబ్ సమరం
  • మొహాలీలో 4 గంటలకు, ముంబైలో 8 గంటలకు షో

దేశంలోని కోట్లాదిమంది అభిమానులను గత ఆరువారాలుగా ఓలలాడిస్తూ వస్తున్న ఐపీఎల్ 12వ సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పోటీలు ముగింపు దశకు చేరాయి.

సూపర్ సండే డబుల్ ధమాకాగా జరిగే పోటీలకు మొహాలీలోని పంజాబ్ క్రికెట్ సంఘం స్టేడియం, ముంబైలోని వాంఖెడీ స్టేడియం వేదికలుగా నిలిచాయి.

మొహాలీలో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే 14వ రౌండ్ తొలి సమరంలో పంజాబ్ తో లీగ్ టేబుల్ టాపర్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతోంది.

ఇప్పటి వరకూ ఆడిన 13 రౌండ్లలో 9 విజయాలు, 4 పరాజయాలతో సహా 18 పాయింట్లు సాధించిన చెన్నై…ప్లే ఆఫ్ రౌండ్లో చోటు ఖాయం చేసుకొంది.

ఆఖరి రౌండ్లో సైతం నెగ్గడం ద్వారా లీగ్ టేబుల్ నంబర్ వన్ స్థానాన్ని మరింతగా పటిష్టం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది.

మరోవైపు …కింగ్స్ పంజాబ్ మాత్రం 12 రౌండ్లలో కేవలం 5 విజయాలు, 10 పాయింట్లతో లీగ్ టేబుల్ ఏడోస్థానంలో నిలిచింది. ఆఖరి రౌండ్లో చెన్నైని ఓడించగలిగితేనే… కింగ్స్ పంజాబ్ కు ప్లే ఆఫ్ రౌండ్ చేరే అవకాశాలు మెరుగుపడతాయి.

చలో… ముంబై…

ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా సూపర్ సండే రెండోమ్యాచ్ గా రాత్రి 8 గంటలకు ఆతిథ్య ముంబై ఇండియన్స్ తో…కోల్ కతా నైట్ రైడర్స్ పోటీపడనుంది.

ముంబై ఇప్పటికే ప్లేఆఫ్ రౌండ్లో చోటు ఖాయం చేసుకోగా…కోల్ కతా నైట్ రైడర్స్ పరిస్థితి మాత్రం గాల్లో దీపంలా మారింది.

మొదటి 13 రౌండ్లలో 8 విజయాలు, 5 పరాజయాల రికార్డుతో ..ముంబై 16 పాయింట్లు సాధించడం ద్వారా నేరుగా ప్లేఆఫ్ రౌండ్లో అడుగుపెట్టింది. హోంగ్రౌండ్లో జరిగే ఆఖరి రౌండ్లో సైతం నెగ్గడం ద్వారా…లీగ్ టేబుల్ రెండోస్థానం నిలుపుకోవాలన్న పట్టుదలతో ఉంది.

ఇక…కోల్ కతా నైట్ రైడర్స్ మాత్రం…12 రౌండ్లలో 5 విజయాలు, 7 పరాజయాల రికార్డుతో లీగ్ టేబుల్ 7వ స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్ ముంబైకి చెలగాటం…కోల్ కతా నైట్ రైడర్స్ కి ప్లే ఆఫ్ సంకటం అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

First Published:  4 May 2019 7:02 PM GMT
Next Story