నా పేరు ఇలా కాదు… అలా పిలవండి

తెలుగులో మహేష్ బాబు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. కానీ రెండవ సినిమా ‘వినయ విధేయ రామ’ డిజాస్టర్ అయినప్పటికీ అభిమానుల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకుంది ఈ భామ.

అయితే తాజాగా ఈమె పేరు ని అందరూ తప్పు పలుకుతూ ఉండడం ఆమెకు అస్సలు నచ్చడం లేదట. ఈమె పేరు కియార అయినప్పటికీ ఈమెను కొందరు కైరా అని పిలుస్తూ ఉంటారు.

తాజాగా ఈమె ఒక బ్రాండ్ ఈవెంట్ కోసం ముంబై వెళ్లింది. అక్కడ మీడియాతో ముచ్చటిస్తూ ఉన్నప్పుడు కొందరు ఆమెను కైరా అని పిలిచారు. ఈ విషయమై ఆమె తన పేరు కియారా అని…. కియార, కైరా రెండు వేరే వేరే పేర్లు అంటూ క్లారిటీ ఇచ్చింది.

మరి ఇప్పటి నుంచి అయినా ఈమెను మీడియా వారు కియార అని పిలుస్తారో లేదో చూడాలి. ఇక సినిమాల పరంగా ఈమె ప్రస్తుతం ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ అయిన ‘కబీర్ సింగ్’ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తోంది. అంతేకాక బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన ‘గుడ్ న్యూస్’ అనే సినిమాలో కూడా నటిస్తోంది.