ఓ మహర్షి…. అందరూ నిర్మాతలే

మహర్షి సినిమాకు ఏకంగా ముగ్గురు నిర్మాతలు. అది కూడా ఛోటామోటా నిర్మాతలు కాదు. అంతా ఉద్దండులే. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ కలిసి ఈ సినిమాను నిర్మించారు. కావాలంటే వీళ్లలో ఏ ఒక్కరైనా సొంతంగా మహర్షి సినిమాను నిర్మించగలరు. కానీ పాత కమిట్ మెంట్స్ వల్ల ముగ్గురూ కలవాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడీ సినిమాలోకి మరింత మంది నిర్మాతలు వచ్చిచేరారు.

అవును.. మహర్షి సినిమాలోకి ఇప్పుడు గీతాఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ కూడా వచ్చిచేరాయి. కృష్ణా జిల్లా పంపిణీకి సంబంధించి ఏ పని చేసినా దిల్ రాజు, అల్లు అరవింద్, ప్రమోద్ కలిసే చేస్తారు. మహర్షి సినిమాకు కూడా అలానే చేశారు. ముగ్గురూ కలిసి కృష్ణా థియేట్రికల్ రైట్స్ తీసుకున్నారు. సో.. ఒక విధంగా అల్లు అరవింద్, ప్రమోద్ కూడా నిర్మాతల కిందే లెక్క.

9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది మహర్షి సినిమా. సినిమాను 120 కోట్ల రూపాయల బడ్జెట్ లో తీశారు. 140 కోట్ల రూపాయలకు వరల్డ్ వైడ్ అమ్మారు. సో.. మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 150 కోట్లు అయినా రావాలి. అంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. అందుకే నిర్మాతలంతా ఇప్పుడు టెన్షన్ లో ఉన్నారు.

మహేష్ సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా రూ. 100-110 కోట్ల వసూళ్లు రాబట్టడం పెద్ద కష్టమేం కాదు. గత సినిమాలతో అది రుజువైంది. అదే సమయంలో మహేష్ సినిమాకు ఏమాత్రం నెగెటివ్ టాక్ వచ్చినా డిజాస్టర్ అవ్వడం కూడా పెద్ద కష్టమేం కాదు. బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలతో ఇది కూడా ప్రూవ్ అయింది. మహర్షి సినిమా ఏమౌతుందో చూడాలి.