Telugu Global
Cinema & Entertainment

అందరితో పాటు ట్రయిలర్ చూశాను- మహేష్

పెద్ద సినిమాలకు హీరోలదే అంతిమ నిర్ణయం. హీరోకు నచ్చకపోతే ఏదైనా తెరవెనక్కి వెళ్లాల్సిందే. అంతగా మేకింగ్ నుంచి ప్రమోషన్ వరకు తమ మార్క్ ఉండేలా చూసుకుంటారు పెద్ద హీరోలు. ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న కల్చర్ ఇదే. కానీ మహర్షి సినిమాకు సంబంధించి ఒక్క విషయంలో మాత్రం కాస్త రివర్స్ లో జరిగింది. అది కూడా కీలకమైన ట్రయిలర్ విషయంలో. అవును… మహేష్ చూడకుండానే మహర్షి ట్రయిలర్ ను విడుదల చేశారు. ఆ విషయాన్ని స్వయంగా మహేష్ […]

అందరితో పాటు ట్రయిలర్ చూశాను- మహేష్
X

పెద్ద సినిమాలకు హీరోలదే అంతిమ నిర్ణయం. హీరోకు నచ్చకపోతే ఏదైనా తెరవెనక్కి వెళ్లాల్సిందే. అంతగా మేకింగ్ నుంచి ప్రమోషన్ వరకు తమ మార్క్ ఉండేలా చూసుకుంటారు పెద్ద హీరోలు. ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న కల్చర్ ఇదే. కానీ మహర్షి సినిమాకు సంబంధించి ఒక్క విషయంలో మాత్రం కాస్త రివర్స్ లో జరిగింది. అది కూడా కీలకమైన ట్రయిలర్ విషయంలో.

అవును… మహేష్ చూడకుండానే మహర్షి ట్రయిలర్ ను విడుదల చేశారు. ఆ విషయాన్ని స్వయంగా మహేష్ బయటపెట్టాడు. తను మహర్షి ట్రయిలర్ ను చూడలేదని, అందరితో పాటు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లోనే చూశానని క్లారిటీ ఇచ్చాడు.

“ట్రయిలర్ కట్ అయింది. ఆ టైమ్ లో నేను పారిస్ లో ఉన్నాను. వంశీ నాకు ఫోన్ చేసి ట్రయిలర్ పంపిస్తాను చూడండి అన్నాడు. ఒక్క క్షణం ఆలోచించారు. ట్రయిలర్ పంపించొద్దని చెప్పేశాను. ఎంతో కష్టపడి సినిమా చేశాం. అలాంటిది ట్రయిలర్ ను చిన్న స్క్రీన్ పై చూడాలనిపించలేదు. అందుకే ట్రయిలర్ ను నాకు పంపించొద్దని చెప్పేశాను.”

ఆ తర్వాత డైరక్ట్ గా యూరోప్ నుంచి 16 గంటలు ప్రయాణం చేసి, హైదరాబాద్ వచ్చి వెంటనే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు హాజరయ్యారని, ప్రేక్షకులందరితో పాటు తను కూడా అప్పుడే ట్రయిలర్ చూశానని క్లారిటీ ఇచ్చాడు మహేష్. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో తను కాస్త భావోద్వేగానికి గురవ్వడానికి ఇది కూడా ఓ కారణమని తెలిపాడు.

First Published:  5 May 2019 5:48 AM GMT
Next Story