శ్రీనివాసరెడ్డి ప్రియురాలు బతికే ఉందా..?

హజీపూర్‌లో వరుస హత్యలు, అత్యాచారాలు చేసిన శ్రీనివాసరెడ్డికి వేములవాడలో ఒక ప్రియురాలు ఉన్నదనే విషయం బయటకు వచ్చింది. అయితే, నిజంగా శ్రీనివాసరెడ్డికి ప్రియురాలు ఉందా..? లేదా అతనే కావాలని పోలీసులను తప్పుదోవ పట్టించాడా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

శ్రీనివాసరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న బృందం ఆ యువతి కోసం శనివారం వేములవాడకు వెళ్లింది. పట్టణంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా ఆ యువతి కోసం గాలింపు చేపట్టారు. కాని అక్కడ ఎలాంటి సమాచారం లభ్యం కాలేదు. అసలు ఆ యువతి ఉందా లేదా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

అయితే, గత నెల 21న అగ్రహారం గుట్టల్లో ఒక యువతి మృత దేహాన్ని కనుగొన్నారు. ఆ శవం ఎవరిదో ఇంత వరకూ తెలియలేదు. ఈ ఘటనకు శ్రీనివాసరెడ్డే కారణమనే వదంతులు వ్యాపించాయి.

మరోవైపు వేములవాడ చుట్టుపక్కల యువతులు అదృశ్యమైన కేసులు ఏమీ నమోదు కాలేదు. దీంతో ఆ యువతి శవం ఎవరిది..? అసలు శ్రీనివాసరెడ్డి ప్రేమికురాలు ఎవరనే విషయంమై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.