Telugu Global
NEWS

సోష‌ల్ మీడియాలో త‌మ్ముళ్ల అకౌంట్లు డిలీట్ !

ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాలు రాలేదు. ఓవైపు చంద్ర‌బాబు స‌మీక్ష‌లు కొన‌సాగుతున్నాయి. మ‌రోవైపు బూత్‌ల వారీగా ఓట్ల లెక్క‌ను త‌మ్ముళ్లు తేలుస్తున్నారు. కానీ మే 23న ఏం జ‌ర‌గ‌బోతుందో తెలిసిన కొంద‌రు త‌మ్ముళ్లు మాత్రం ఇప్పుడు అల‌ర్ట్ అయ్యారు. పోలింగ్ జ‌రిగిన మ‌రుస‌టి రోజు నుంచి తెలుగుదేశం సోష‌ల్ మీడియాలో కీల‌క‌మైన కొంద‌రు వ్య‌క్తులు మాత్రం ముఖం చాటేశారు. సోష‌ల్ మీడియాలో వారి యాక్టివ్ త‌గ్గింది. ఇంత‌కుముందు తుమ్మినా ద‌గ్గినా పోస్టుల‌తో విరుచుకుప‌డే ఈ బ్యాచ్ ఇప్పుడు క‌నిపించ‌డం […]

సోష‌ల్ మీడియాలో త‌మ్ముళ్ల అకౌంట్లు డిలీట్ !
X

ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాలు రాలేదు. ఓవైపు చంద్ర‌బాబు స‌మీక్ష‌లు కొన‌సాగుతున్నాయి. మ‌రోవైపు బూత్‌ల వారీగా ఓట్ల లెక్క‌ను త‌మ్ముళ్లు తేలుస్తున్నారు. కానీ మే 23న ఏం జ‌ర‌గ‌బోతుందో తెలిసిన కొంద‌రు త‌మ్ముళ్లు మాత్రం ఇప్పుడు అల‌ర్ట్ అయ్యారు.

పోలింగ్ జ‌రిగిన మ‌రుస‌టి రోజు నుంచి తెలుగుదేశం సోష‌ల్ మీడియాలో కీల‌క‌మైన కొంద‌రు వ్య‌క్తులు మాత్రం ముఖం చాటేశారు. సోష‌ల్ మీడియాలో వారి యాక్టివ్ త‌గ్గింది. ఇంత‌కుముందు తుమ్మినా ద‌గ్గినా పోస్టుల‌తో విరుచుకుప‌డే ఈ బ్యాచ్ ఇప్పుడు క‌నిపించ‌డం లేదు.

ముఖ్యంగా తెలుగుదేశం సోష‌ల్ మీడియాలో కీల‌క‌మైన స‌తీష్ చాగంటి లాంటి వాళ్లు అకౌంట్లు మొత్తం డిలీట్ చేశారు. ఆయ‌న‌తో పాటు చాలా మంది తెలుగు త‌మ్ముళ్లు ఫేస్‌బుక్ అకౌంట్లు డిలీట్ చేస్తున్నారు. తెలుగుదేశం ఓట‌మి చెందుతుంద‌ని తెలిసి వీరంతా…త‌మ అకౌంట్లు డిలీట్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.

వ‌చ్చే ప్రభుత్వంలో త‌మ‌కు స‌మ‌స్య‌లు రాకూడ‌ద‌ని ముందు జాగ్ర‌త్త‌గా అకౌంట్లు డిలీట్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు అన్నీ ర‌కాలుగా ప్రయోజనాలు పొంది…అధికారం పోతుంద‌ని తెలిసి వీరంతా జారుకుంటున్నార‌ని పార్టీలోని మ‌రోవ‌ర్గం ఆరోపిస్తోంది.

ఇటీవ‌ల చంద్ర‌బాబునాయుడితో సోష‌ల్ మీడియా వింగ్ మీటింగ్ జ‌రిగింది. ఇప్ప‌టి నుంచి మ‌నం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని సూచించారు… అంటే ప్ర‌తిప‌క్షంలో మ‌నం కీల‌క పాత్ర పోషించాల‌ని ఆయ‌న ఇన్‌డైరెక్టుగా సిగ్న‌ల్స్ పంపారు. కానీ త‌మ్ముళ్లు మాత్రం వేరేలా అర్ధం చేసుకున్నారు. ప‌దుల సంఖ్య‌లో ఇంత‌కుముందు క్రియేట్ చేసిన ఫేస్‌బుక్ అకౌంట్ల‌ను డిలీట్ చేస్తున్నారు. ముందు జాగ్ర‌త్త ప‌డుతున్నారు.

మే 23 త‌ర్వాత ఇంకా ఎన్ని సిత్రాలు జ‌రుగుతాయో…ఎందరు త‌మ్ముళ్లు త‌మ అకౌంట్ల‌ను డిలీట్ చేస్తారో చూడాలి.

First Published:  5 May 2019 12:35 AM GMT
Next Story