Telugu Global
Cinema & Entertainment

త్రివిక్రమ్ చెప్పిన స్టోరీకి 2000 కోట్లు ఖర్చు అవుతుందట...!

గత కొంతకాలంగా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కమెడియన్ సునీల్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య స్నేహం గురించి చెప్పాలంటే చాలా కాలం వెనక్కి వెళ్లాలి. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు వారిద్దరూ మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. తాజాగా త్రివిక్రమ్ రాసుకున్న ఒక స్క్రిప్ట్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టాడు సునీల్. ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “కొన్నేళ్ల క్రితం త్రివిక్రమ్ నాకు ఒక అద్భుతమైన కథ […]

త్రివిక్రమ్ చెప్పిన స్టోరీకి 2000 కోట్లు ఖర్చు అవుతుందట...!
X

గత కొంతకాలంగా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కమెడియన్ సునీల్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య స్నేహం గురించి చెప్పాలంటే చాలా కాలం వెనక్కి వెళ్లాలి.

ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు వారిద్దరూ మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. తాజాగా త్రివిక్రమ్ రాసుకున్న ఒక స్క్రిప్ట్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టాడు సునీల్.

ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “కొన్నేళ్ల క్రితం త్రివిక్రమ్ నాకు ఒక అద్భుతమైన కథ చెప్పాడు. ఆ కథను సినిమాగా మార్చాలంటే అప్పట్లోనే 500 కోట్ల బడ్జెట్ కావాలి. ఇప్పుడు ఆ సినిమాని తీయడానికి కనీసం రెండు వేల కోట్ల బడ్జెట్ అవసరం అవుతుంది” అని చెప్పాడు సునీల్.

అయితే సినిమా తీశాక ప్రొడ్యూసర్లు కానీ బయ్యర్లు కానీ నష్టపోయే ప్రసక్తే లేదని ఎందుకంటే కథ అంత అద్భుతంగా ఉంటుందని సునీల్ భరోసా ఇచ్చాడు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటిదాకా భారీ బడ్జెట్ చిత్రాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.

పైగా ‘బాహుబలి’ లాంటి సినిమానే ఓవరాల్ గా రెండు వేల కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఒక సినిమా కోసం రెండు వేల కోట్లు బడ్జెట్ పెట్టడానికి ఏ నిర్మాత అయినా ముందుకు వస్తాడా? అనేది చూడాలి. ఇక ఈ సినిమా గురించి పక్కన పెడితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

First Published:  4 May 2019 7:02 PM GMT
Next Story