జగన్ ప్రమాణ స్వీకారానికి వెళతా…. కేసీఆర్ కాన్ఫిడెంట్ కు కారణమిదే….

కేసీఆర్ ధీమాగా చెబుతున్నారు. ఈసారి ఏపీలో జగన్ దే గెలుపు అని.. తనకు సమాచారం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఇంతకీ కేసీఆర్ అంత బలంగా నమ్మడానికి కారణమేంటి? ఎందుకు జగనే గెలుస్తాడని కేసీఆర్ భావిస్తున్నాడు.

తాజాగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో కేసీఆర్ సంచలన నిజాలు బయటపెట్టాడు. అవేంటో చూద్దాం…

కేసీఆర్ ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ సీనియర్ నేతలు, ముఖ్యులతో ఏపీ పాలిటిక్స్ పై చర్చించారట…. ఏపీలో మే 23 ఫలితాల తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి తాను హాజరు కాబోతున్నట్టు ప్రకటించారు. తనతోపాటు తన కూతురు కవిత కూడా జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారని కేసీఆర్ అన్నట్లు తెలిసింది.

అయితే ఫలితాలు రాకముందే జగన్ ఎలా గెలుస్తాడని చెబుతున్నారనే ప్రశ్నను టీఆర్ఎస్ నేతలు లేవనెత్తారట. సొంతంగా కొన్ని కీలక సర్వేలు చేశానని కేసీఆర్ చెప్పుకొచ్చారట. రిపోర్టులు తెప్పించుకున్నానని…. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా తెప్పించానని…. నేను చేసిన సర్వే రిపోర్టులు ఎప్పుడూ తప్పుకాలేదని.. అన్ని సర్వేలూ జగన్ గెలుస్తాడనే చెబుతున్నాయని కేసీఆర్ కుండబద్దలు కొట్టారు.

అన్ని సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్నాకే…. జగన్ గెలుస్తాడని నిర్ధారించుకొని ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్లాలని నిర్ణయించుకున్నానని అన్నారట.

జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి హాజరైతే.. తాను చంద్రబాబుకు ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ 100శాతం పూర్తి అవుతుందని కేసీఆర్ నేతలతో అన్నట్టు సమాచారం.

ప్రస్తుతం ఆ రిటర్న్ గిఫ్ట్ ప్రాసెస్ లో ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తాను జగన్ ప్రమాణానికి వెళ్లాక అక్కడ తన రిటర్న్ గిఫ్ట్ ఏంటో బాబుకు అర్థం అవుతుందని…. ఆ సమావేశంలోనే అసలు విషయాలు చెబుతానని అన్నట్టు తెలిసింది. జగన్ గెలిస్తే ఫెడరల్ ఫ్రంట్ కూడా బలోపేతం అవుతందని కేసీఆర్ అభిప్రాయపడ్డట్టు తెలిసింది.