Telugu Global
NEWS

కేసీఆర్ ను చూసి బాబులో మళ్లీ భయం....

తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చంద్రబాబును గుబులు చెందిస్తున్నాయి.  కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ కోసం జాతీయ స్థాయిలో కూటమి కట్టేందుకు కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే కేసీఆర్ దక్షిణాది పర్యటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలను లైట్ తీసుకున్నారు. చంద్రబాబు తాజాగా టీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేసీఆర్ ను నమ్మి ఎవరూ ఫెడరల్ ఫ్రంట్ లో చేరడానికి రారు అని బాబు నేతలతో అన్నట్టు సమాచారం. […]

కేసీఆర్ ను చూసి బాబులో మళ్లీ భయం....
X

తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చంద్రబాబును గుబులు చెందిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ కోసం జాతీయ స్థాయిలో కూటమి కట్టేందుకు కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే కేసీఆర్ దక్షిణాది పర్యటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలను లైట్ తీసుకున్నారు.

చంద్రబాబు తాజాగా టీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేసీఆర్ ను నమ్మి ఎవరూ ఫెడరల్ ఫ్రంట్ లో చేరడానికి రారు అని బాబు నేతలతో అన్నట్టు సమాచారం.

‘కేసీఆర్ ఏ రాష్ట్రంలో పర్యటించినా.. ఏ రాష్ట్ర నేతను కలిసినా ఎవ్వరూ ఆయనను విశ్వసించరు.. ఫెడరల్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ రహస్య ఎజెండాతో వెళుతున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ, మోడీలకు ప్రయోజనకరమైన అజెండాను అమలు చేస్తారు’ అని చంద్రబాబు నేతలతో అన్నట్టు సమాచారం.

‘సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలన్నా…. ఫెడరల్ ఫ్రంట్ కు బీజం పడాలన్నా సమన్వయం, కృషి, నిజాయితీ, విశ్వాసం, నిబద్ధత ఉండాలని.. అవి కేసీఆర్ కు లేవు’ అని చంద్రబాబు నేతలతో మాట్లాడినట్టు సమాచారం. ఒక వేళ నిజంగా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరిట జాతీయ స్థాయిలో పార్టీలన్నింటిని కలిపి మోడీకి వ్యతిరేకంగా వెళితే తాను కూడా కేసీఆర్ తో కలుస్తానని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు తెలిసింది.

దేశంలో రాహుల్ గాంధీ కన్నా మెరుగైన ప్రధాని ప్రస్తుతానికి లేడని.. ఆయన సమాఖ్య వాదంతో పనిచేస్తారని.. అందరినీ గౌరవిస్తాడని తెలిపారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా రాహుల్ ప్రధానికి సూట్ అవుతాడని చెప్పాడని బాబు చెప్పుకొచ్చారు. కేసీఆర్ కానీ మోడీ కానీ ఇందుకు అనర్హుడని తేల్చిచెప్పాడు.

ఇలా కేసీఆర్ రాజకీయ ప్రయత్నాలు చూసి బాబులో భయం మొదలైంది.. కేసీఆర్ దూకుడుగా ముందుకెళ్తుండడం.. ఏపీలో తన గెలుపుపై అనుమానాలుండడంతో బాబులో ఆందోళన పెరిగిపోతోందట.. కేసీఆర్ కు ఈ ఎన్నికల్లో గెలిచినా.. ఓడినా పెద్దగా డ్యామేజ్ ఏం లేదు. కానీ బాబు ఓడితే మాత్రం జాతీయ, రాష్ట్రంలోనూ కనుమరగవ్వడం ఖాయం. ఇదే బాబును వేదిస్తోందట..

First Published:  6 May 2019 5:31 AM GMT
Next Story