Telugu Global
NEWS

తొలి క్వాలిఫైయర్ సమరానికి అంతా సిద్ధం

నువ్వానేనా అంటు చెన్నై, ముంబై తొలిక్వాలిఫైయర్ లో విఫలమైనా మరో చాన్స్ భారత క్రికెట్ అభిమానుల వేసవి వినోదం ipl 12వ సీజన్ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లు ముగిసిన 48 గంటల విరామం తర్వాత… క్వాలిఫైయర్స్ తొలిసమరానికి చెన్నై చెపాక్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. 56 మ్యాచ్ ల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో టేబుల్ మొదటి స్థానాల్లో నిలిచిన ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ జట్లు మాత్రమే క్వాలిఫైయర్స్ రౌండ్ చేరుకోగా.. జైపూర్, కోల్ […]

తొలి క్వాలిఫైయర్ సమరానికి అంతా సిద్ధం
X
  • నువ్వానేనా అంటు చెన్నై, ముంబై
  • తొలిక్వాలిఫైయర్ లో విఫలమైనా మరో చాన్స్

భారత క్రికెట్ అభిమానుల వేసవి వినోదం ipl 12వ సీజన్ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లు ముగిసిన 48 గంటల విరామం తర్వాత… క్వాలిఫైయర్స్ తొలిసమరానికి చెన్నై చెపాక్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది.

56 మ్యాచ్ ల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో టేబుల్ మొదటి స్థానాల్లో నిలిచిన ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ జట్లు మాత్రమే క్వాలిఫైయర్స్ రౌండ్ చేరుకోగా.. జైపూర్, కోల్ కతా, బెంగళూరు, పంజాబ్ జట్లు మాత్రం లీగ్ దశ నుంచే నిష్క్రమించక తప్పలేదు.

చెపాక్ స్టేడియం వేదికగా జరిగే తొలి క్వాలిఫైయర్ సమరంలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో మాజీ చాంపియన్, టేబుల్ టాపర్ ముంబై తాడోపేడో తేల్చుకోనుంది.

14 రౌండ్ల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో అత్యధిక విజయాలు సాధించడం ద్వారా టాపర్ గా నిలిచిన మాజీ విజేత ముంబై కి చెపాక్ స్టేడియం వేదికగా మెరుగైన ఫలితాలే ఉన్నాయి. చెపాక్ లో 6 మ్యాచ్ ల్లో పోటీ పడిన ముంబై 4 విజయాలు నమోదు చేసింది.

రెండుజట్ల పేస్ టు ఫేస్ రికార్డులు చూసినా ముంబైదే పైచేయిగా ఉంది. ఈ రెండుజట్లూ ఇప్పటి వరకూ 26 సార్లు తలపడితే ముంబై 15-11 రికార్డుతో ఉంది.

ఇటు చెన్నై, అటు ముంబై…. రెండుజట్లూ తమ ఆఖరి రౌండ్ మ్యాచ్ లను ఆదివారమే ఆడాల్సి రావడంతో..కేవలం కొద్ది గంటల విరామం లోనే.. క్వాలిఫైయర్స్ బరిలోకి దిగడం సవాలుగా మారింది.

ఈ మ్యాచ్ లో నెగ్గిన జట్టు నేరుగా ఫైనల్ చేరుకోగలుగుతుంది. పరాజయం పొందినజట్టుకు మరోసారి ఫైనల్స్ బెర్త్ కోసం పోటీపడే అవకాశం ఉంది.

స్పిన్ బౌలింగ్ కు అనువుగా ఉండే చెపాక్ స్టేడియం పిచ్ పైన 170కి పైగా పరుగులు సాధించిన జట్టుకే విజయావకాశాలు ఉన్నాయి.

క్వాలిఫైయర్స్ ఈ కీలక సమరంలో చెన్నై బదులు తీర్చుకొంటుందా…లేక ముంబై తన ఆధిపత్యాన్ని చాటుకొంటూ ఫైనల్ చేరుతుందా.. తెలుసుకోవాలంటే.. కొద్ది గంటలపాటు వేచిచూడక తప్పదు.

First Published:  7 May 2019 9:04 AM GMT
Next Story