Telugu Global
Cinema & Entertainment

మహేష్ బాబు... మే సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో 25వ చిత్రంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాని మే 9కి వాయిదా వేశారు. కానీ మహేష్ అభిమానులకు మే లో విడుదలైన మహేష్ బాబు సినిమాలు సరిగ్గా ఆడవని ఒక సెంటిమెంట్ ఉంది. దానికి తగ్గట్టుగానే విడుదలైన ‘నిజం’, ‘నాని’, మరియు ‘బ్రహ్మోత్సవం’ […]

మహేష్ బాబు... మే సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడా?
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో 25వ చిత్రంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా త్వరలో విడుదల కాబోతోంది.

నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాని మే 9కి వాయిదా వేశారు. కానీ మహేష్ అభిమానులకు మే లో విడుదలైన మహేష్ బాబు సినిమాలు సరిగ్గా ఆడవని ఒక సెంటిమెంట్ ఉంది. దానికి తగ్గట్టుగానే విడుదలైన ‘నిజం’, ‘నాని’, మరియు ‘బ్రహ్మోత్సవం’ సినిమాలు ఎంత పెద్ద డిజాస్టర్లుగా మారాయో అందరికీ తెలిసిన విషయమే.

కానీ తాజా సమాచారం ప్రకారం ‘మహర్షి’ సినిమా కి ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదని, ఆ సెంటిమెంట్ నుంచి మహేష్ బాబు ని సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కాపాడతారని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు.

తాజాగా జరిగిన ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెంకటేష్ ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే ‘మహర్షి’ కంటే ముందు వెంకటేష్ ‘మజిలీ’ మరియు ‘జెర్సీ’ సినిమాల వేడుకలకు కూడా హాజరయ్యాడు. నాగచైతన్య, సమంత నటించిన ‘మజిలీ’ మరియు నాని నటించిన ‘జెర్సీ’ సినిమాలు ఇప్పుడు బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో వెంకి ‘మహర్షి’ సినిమాకి కూడా హాజరు అవడం వలన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలుస్తుందని అభిమానులు అనుకుంటున్నారు. దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.

First Published:  7 May 2019 1:00 AM GMT
Next Story