Telugu Global
Health & Life Style

మందు బాబులకు బీరకాయ....

అదేమిటి అచ్చు తప్పు అనుకుంటున్నారా…! కాదండీ ఇది నిజమే. కాలేయానికి బీరకాయ బ్రహ్మండమైన ఔషధం. మందు.. అదే మద్యపానం సేవించే వారు ప్రతిరోజూ బీరకాయ తింటే వారి లివర్ కు ఎటువంటి ఢోకా ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి మద్యపానం అలవాటు లేని వారికి ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో అన్న అనుమానం మీకు రావచ్చు… బీరకాయలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెల్సుకుందాం. సాధారణంగా బీరకాయను పథ్యానికి వాడతారు. బీరకాయ తొందరగా జీర్ణం అవుతుంది. […]

మందు బాబులకు బీరకాయ....
X

అదేమిటి అచ్చు తప్పు అనుకుంటున్నారా…! కాదండీ ఇది నిజమే. కాలేయానికి బీరకాయ బ్రహ్మండమైన ఔషధం. మందు.. అదే మద్యపానం సేవించే వారు ప్రతిరోజూ బీరకాయ తింటే వారి లివర్ కు ఎటువంటి ఢోకా ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరి మద్యపానం అలవాటు లేని వారికి ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో అన్న అనుమానం మీకు రావచ్చు… బీరకాయలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెల్సుకుందాం.

  • సాధారణంగా బీరకాయను పథ్యానికి వాడతారు.
  • బీరకాయ తొందరగా జీర్ణం అవుతుంది. దీనిలో ఉన్న పీచు పదార్దం మలబద్దకాన్ని నివారిస్తుంది.
  • పచ్చకామెర్లకు బీరకాయ మంచి మందు. కామెర్లతో బాధపడుతున్న వారు బీరకాయ జ్యూస్ తాగితే అద్భుతంగా పనిచేస్తుంది.
  • బీరకాయ రక్తశుద్దికి ఎంతో ఉపయోగపడుతుంది. బీరకాయ నాలుకకు రుచిని కలిగిస్తుంది.
  • డైటింగ్ చేస్తున్నవారు ప్రతిరోజూ బీరకాయ తినాలి. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది.
  • ఇందులో ఉన్న మినరల్స్, విటమిన్స్, ఫైబర్ బరువు తగ్గేందుకు సహాయపడతాయి.
  • బీరకాయలో టాక్సిన్స్ ను తొలగించే యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఇన్షమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరంలో ఉన్న మలినాలను శుద్ది చేసేందుకు సహకరిస్తాయి.
  • రక్తంలోని ఇన్సూలెన్ లెవెల్స్ ను పెంచి గ్లూకోజ్ లెవెల్స్ ను సమతూల్యం చేసే గుణం బీరకాయలో పుష్కలంగా ఉంది అంటున్నారు వైద్య నిపుణులు.
  • బీరకాయకు అన్ని రకాల బ్యాక్టీరీయాలతో పోరాడే శక్తి ఉంది. ప్రతిరోజూ బీరకాయ జ్యూస్ తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • పొడిబారిన చర్మానికి బీరకాయ అద్బుత ఔషధం. బీరకాయ జ్యూస్ తాగిన లేదా బీరకాయ పేస్ట్ ను రుద్దడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
  • చర్మంపై ఉన్న మ్రుత కణాలను తొలగించడంలో బీరకాయ ముఖ్య పాత్ర పోషిస్తుంది.
  • బీర పాదు ఆకుల కషాయం చెడు రక్తన్ని గుండెకు అందకుండా చేస్తుంది. అంతే కాదు రక్తన్ని శుద్ది చేస్తుంది.
  • బీరకాయలో ఉన్న విటమిన్ ఎ కంటి సమస్యలను నివారిస్తుంది.
  • ఇందులో ఉన్న విటమిన్ బి6 ఎనీమియను నివారిస్తుంది.
First Published:  6 May 2019 8:36 PM GMT
Next Story