Telugu Global
NEWS

స్టీల్ సిటీని తాకిన ఐపీఎల్ ఫీవర్

చుక్కలు తాకిన ఐపీఎల్ విశాఖ మ్యాచ్ టికెట్ల ధరలు ప్లే ఆఫ్ రౌండ్లో రెండుమ్యాచ్ లకు ఆతిథ్యం  ఎలిమినేటర్ రౌండ్లో సన్ రైజర్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ  రెండో క్వాలిఫైయర్స్ సమరానికీ విశాఖ సిద్ధం ఐపీఎల్ 12వ సీజన్ లో ఆంధ్ర క్రికెట్ సంఘం రొట్టె విరిగి నేతిలో పడింది. ఏకంగా రెండు క్వాలిఫైయర్స్ రౌండ్ మ్యాచ్ లకు ఆతిథ్యమిచ్చే అరుదైన అవకాశాన్ని స్టీల్ సిటీ విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియం సొంతం […]

స్టీల్ సిటీని తాకిన ఐపీఎల్ ఫీవర్
X
  • చుక్కలు తాకిన ఐపీఎల్ విశాఖ మ్యాచ్ టికెట్ల ధరలు
  • ప్లే ఆఫ్ రౌండ్లో రెండుమ్యాచ్ లకు ఆతిథ్యం
  • ఎలిమినేటర్ రౌండ్లో సన్ రైజర్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ
  • రెండో క్వాలిఫైయర్స్ సమరానికీ విశాఖ సిద్ధం

ఐపీఎల్ 12వ సీజన్ లో ఆంధ్ర క్రికెట్ సంఘం రొట్టె విరిగి నేతిలో పడింది. ఏకంగా రెండు క్వాలిఫైయర్స్ రౌండ్ మ్యాచ్ లకు ఆతిథ్యమిచ్చే అరుదైన అవకాశాన్ని స్టీల్ సిటీ విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియం సొంతం చేసుకొంది.


మే 8న జరిగే ఎలిమినేటర్ రౌండ్ తో పాటు..మే 10న జరిగే రెండో క్వాలిఫైయర్స్ మ్యాచ్ కు సైతం విశాఖనే వేదికగా ఖరారు చేశారు.

డబుల్ ధమాకా….

ఐపీఎల్ 12వ సీజన్ కే అత్యంత ప్రధానమైన ఆఖరి మూడు మ్యాచ్ లూ నిర్వహించే అవకాశం తెలుగు రాష్ట్రాల వేదికలకే దక్కడాన్ని అరుదైన అవకాశంగా భావిస్తున్నారు.

మే 8, 10 తేదీలలో జరిగే మ్యాచ్ లకు ఆంధ్రప్రదేశ్, మే 12న జరిగే ఫైనల్స్ కు తెలంగాణా రాష్ట్రాల ప్రధాన క్రికెట్ వేదికలు ఆతిథ్యమివ్వటాన్ని రెండురాష్ట్రాల క్రికెట్ అభిమానులు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు.

టికెట్ల ధరలు ఆకాశంలో….

ఐపీఎల్ అంటేనే మన క్రికెట్ అభిమానులకు ఎక్కడలేని వేలం వెర్రి. దీనికితోడు…బీసీసీఐ సైతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను..ఫక్తు వ్యాపారంలా నిర్వహిస్తోంది.

సీజన్ సీజన్ కూ టికెట్ల రేట్లను పెంచివేస్తూ..సగటు అభిమానికి ప్రత్యక్షంగా మ్యాచ్ ను చూసే అవకాశం లేకుండా చేస్తోంది. క్వాలిఫైయర్స్ రౌండ్లలో భాగంగా జరిగే మ్యాచ్ లు చూడాలంటే…గ్యాలరీ టికెట్ కే 1000 రూపాయల వరకూ ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది.

విశాఖ, హైదరాబాద్ …వేదికలు ఏవైనా ఐపీఎల్ మ్యాచ్ ల టికెట్ల ధరలు మాత్రం కొండెక్కి కూర్చున్నాయి. దీనితో అభిమానులంతా.. టీవీలలో వీక్షించడానికి మాత్రమే పరిమితం కావాల్సి వస్తోంది.

హాట్ కేకులు ఎలిమినేటర్ మ్యాచ్ టికెట్లు..

విశాఖలోని ఆంధ్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా…హైదరాబాద్ సన్ రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య బుధవారం జరిగే ఎలిమినేటర్ రౌండ్ మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయని నిర్వాహక సంఘం ఇప్పటికే ప్రకటించింది.

ఢిల్లీ జట్టులో రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, పృథ్వీ షా లాంటి ఆటగాళ్లు ఉంటే…విలియమ్స్ సన్ నాయకత్వంలోని సన్ రైజర్స్ జట్టులో.. రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్ లాంటి మొనగాళ్లున్నారు.

ఈ మ్యాచ్ లో నెగ్గిన జట్టు…విశాఖ వేదికగానే మే 10న జరిగే రెండో క్వాలిఫైయర్ రౌండ్లో సైతం పోటీపడాల్సి ఉంది.

మొత్తం మీద…స్టీల్ సిటీ అభిమానులతో పాటు…తెలుగు రాష్ట్రాల అభిమానులకు సైతం.. ఐపీఎల్ ఎలిమినేటర్, రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ లు పసందైన విందే కానున్నాయి.

First Published:  7 May 2019 9:51 AM GMT
Next Story