ఫిక్స్… అది మహేష్ బాబు సినిమానే

కొన్ని రోజుల కిందటి ముచ్చట. మహేష్ బాబుతో సినిమా కోసం సుకుమార్ తెగ ప్రయత్నించాడు. ఎన్నోసార్లు కథాచర్చలు జరిగాయి. ఫైనల్ గా సుకుమార్ కు హ్యాండ్ ఇచ్చాడు మహేష్. ఇలాంటివి ఇండస్ట్రీలో కామన్. కానీ ఈ వ్యవహారం జనాల్ని ఎట్రాక్ట్ చేయడానికి మరో కారణం ఉంది. మహేష్ ఇలా నో చెప్పిన వెంటనే, బన్నీతో సినిమా ఎనౌన్స్ చేశాడు సుకుమార్. సరిగ్గా ఇక్కడే అందరికీ అనుమానాలు రేకెత్తాయి. మహేష్ కోసం చెప్పిన కథతోనే బన్నీతో సెట్స్ పైకి వెళ్లబోతున్నాడా అంటూ పుకార్లు ఊపందుకున్నాయి. అవి నిజమే అనే విషయం ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమౌతోంది.

బన్నీ సినిమా కోసం శేషాచలం అడవుల్లో లొకేషన్లు వెదుకుతున్నాడు సుకుమార్. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందట. సరిగ్గా మహేష్ బాబుకు సుకుమార్ చెప్పిన స్టోరీ కూడా ఇదే. సో.. మహేష్ కు చెప్పిన కథతోనే బన్నీతో సుకుమార్ సినిమా చేయబోతున్నాడనే విషయం స్పష్టమైంది.

ఈనెల 11న ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా కంప్లీట్ అయిన వెంటనే సుకుమార్ సినిమాను స్టార్ట్ చేస్తాడు బన్నీ. ఆ తర్వాత దిల్ రాజు నిర్మాణంలో ఐకాన్ మూవీ ప్రారంభమౌతుంది.