Telugu Global
Cinema & Entertainment

ఎట్టకేలకు ఆ రీమేక్ ఖరారైంది

ఈమధ్య కాలంలో కోలీవుడ్ లో బాగా హిట్ అయిన సినిమా విక్రమ్ వేధ. మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా నటించిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా తమిళనాట ప్రభంజనం సృష్టించింది. కేవలం హీరోల వల్లే ఆడిన సినిమా కాదు, కంటెంట్ వల్ల ఆడిన మూవీ ఇది. అది హిట్ అయినప్పట్నుంచి దాని తెలుగు రీమేక్ పై కథనాలు వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు విక్రమ్ వేద రీమేక్ కు లైన్ క్లియర్ అయింది. తెలుగులో ఈ సినిమాను […]

ఎట్టకేలకు ఆ రీమేక్ ఖరారైంది
X

ఈమధ్య కాలంలో కోలీవుడ్ లో బాగా హిట్ అయిన సినిమా విక్రమ్ వేధ. మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా నటించిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా తమిళనాట ప్రభంజనం సృష్టించింది. కేవలం హీరోల వల్లే ఆడిన సినిమా కాదు, కంటెంట్ వల్ల ఆడిన మూవీ ఇది. అది హిట్ అయినప్పట్నుంచి దాని తెలుగు రీమేక్ పై కథనాలు వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు విక్రమ్ వేద రీమేక్ కు లైన్ క్లియర్ అయింది.

తెలుగులో ఈ సినిమాను వెంకటేశ్, నారా రోహిత్ చేయబోతున్నారు. మాధవన్ పోషించిన పాత్రను వెంకటేశ్, విజయ్ సేతుపతి పాత్రలో నారా రోహిత్ కనిపించబోతున్నారు. ఇక ఒరిజినల్ వెర్షన్ లో నటించిన శ్రద్ధాశ్రీనాధ్ ను తెలుగులో కూడా రిపీట్ చేయాలని నిర్ణయించారు. జెర్సీ సినిమాతో ఆమెకు తెలుగులో కూడా పాపులారిటీ పెరిగింది. అందుకే ఆమెను మరోసారి తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు.

నిజానికి ఈ సినిమా రీమేక్ లేట్ అవ్వడానికి ఓ కారణం ఉంది. విజయ్ సేతుపతి పోషించిన పాత్ర కోసం చాలామంది నటుల్ని సంప్రదించారు. కానీ ఎవ్వరూ ముందుకురాలేదు. ఎట్టకేలకు నారా రోహిత్ అంగీకరించడంతో రీమేక్ సాకారమైంది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా బ్యానర్లపై త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. వెంకీ మామ ప్రాజెక్టు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత విక్రమ్ వేద రీమేక్ పై అధికారికంగా ప్రకటన వస్తుంది.

First Published:  6 May 2019 10:22 PM GMT
Next Story