‘ఉప్పెన’…. వైష్ణవ్ సినిమాకి ఖరారైన టైటిల్

సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ త్వరలో హీరోగా మారబోతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ అసిస్టెంట్ అయిన బుచ్చిబాబు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా మారబోతున్నాడు.

ఈ మధ్యనే మొదలైన ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. గత కొంత కాలంగా ఈ సినిమా టైటిల్ మరియు కథ గురించి కొన్ని పుకార్లు బయటకు వచ్చాయి. ఈ సినిమా ఒక రస్టిక్ లవ్ స్టోరీ అని… ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ ఒక చేపలు పట్టేవాడిగా కనిపిస్తాడని ఈ సినిమాకి ‘జాలరి’ అనే టైటిల్ ను ఖరారు చేశారని వార్తలు బయటకు వచ్చాయి.

కానీ తాజా సమాచారం ప్రకారం చిత్ర బృందం ఈ పుకార్లను కొట్టిపారేసింది. అంతేకాకుండా ఫిలిం చాంబర్ లో ఈ సినిమాకు ‘ఉప్పెన’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించింది. రొమాంటిక్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించబోతున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.