అప్పుడు సునీల్…. ఇప్పుడు అల్లరోడు

మొన్నటివరకు హీరోలుగా నటించి, ఒక్కసారిగా సైడ్ క్యారెక్టర్లకు, హీరో ఫ్రెండ్ పాత్రలకు షిఫ్ట్ అవ్వాలంటే చాలా కష్టం. అన్నింటికీ మించి మనసు చంపుకొని పనిచేయాల్సి ఉంటుంది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అలాంటి పనులకు ఓకే చెప్పక తప్పదు. ఆల్రెడీ ఇలాంటి ప్రయత్నాన్ని సునీల్ చేశాడు. ఇప్పుడు అల్లరోడు చేయబోతున్నాడు.

హీరోగా వరుస ఫ్లాపులు రావడంతో సునీల్ మళ్లీ క్యారెక్టర్ రోల్స్ కు షిఫ్ట్ అయ్యాడు. అరవింద సమేతలో ఎన్టీఆర్ కు ఫ్రెండ్ గా నటించాడు. కానీ ఆ సినిమాలో సునీల్ రోల్ పెద్దగా క్లిక్ అవ్వలేదు. అయినప్పటికీ తప్పుదు కాబట్టి సునీల్ అదే పనిని కంటిన్యూ చేస్తున్నాడు. తాజాగా అతడు నటించిన చిత్రలహరి సినిమా హిట్ అవ్వడంతో పాటు అందులో సునీల్ చేసిన పాత్రకు మంచి పేరొచ్చింది. సో.. ప్రస్తుతానికైతే సునీల్ హ్యాపీ.

మరి అల్లరి నరేష్ సంగతేంటి. ఈ హీరో సునీల్ టైపే. హీరోగా వరుసగా ఫ్లాపులు వస్తున్న వేళ, వంశీ పైడిపల్లి ఓ ఫ్రెండ్ క్యారెక్టర్ చెప్పేసరికి ఒప్పుకున్నాడు. పైగా అది మహేష్ బాబు సినిమా కావడంతో కాదనలేకపోయాడు.

అలా మహర్షిలో మహేష్ కు ఫ్రెండ్ గా సెట్ అయ్యాడు అల్లరోడు. ఈ సినిమా సక్సెస్ అయితే హీరోగా కొనసాగాలా, క్యారెక్టర్ రోల్స్ చేయాలా అనే విషయంపై అల్లరినరేష్ కు క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికైతే యూనిట్ అందరితో పాటు అల్లరోడు కూడా టెన్షన్ లో ఉన్నాడు. అతడి కెరీర్ ను డిసైడ్ చేసే సినిమా ఇది.