Telugu Global
Cinema & Entertainment

కన్నడ బ్యూటీ తో మళ్ళీ జత కడుతున్న బాలయ్య

బాలకృష్ణ ప్రస్తుతం తన సినిమాల పైన ఫోకస్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఎన్నికలు ముగిసిన నేపథ్యం లో ఆయన మళ్ళి షూటింగ్స్ కి రెడీ అవుతున్నాడు. అయితే ఈ సారి అనుకున్నట్లు గా బోయపాటి శ్రీను తో కాకుండా కేఎస్ రవికుమార్ దర్శకత్వం లో ఒక చిత్రాన్ని చేయనున్నాడు బాలకృష్ణ. ఇంతకు ముందు వీళ్ళ కాంబినేషన్ లో జై సింహా చిత్రం వచ్చింది. ఇప్పుడు మరలా కలిసి పని చేయనున్నారు. అయితే తాజా ఫిలిం నగర్ […]

కన్నడ బ్యూటీ తో మళ్ళీ జత కడుతున్న బాలయ్య
X

బాలకృష్ణ ప్రస్తుతం తన సినిమాల పైన ఫోకస్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఎన్నికలు ముగిసిన నేపథ్యం లో ఆయన మళ్ళి షూటింగ్స్ కి రెడీ అవుతున్నాడు. అయితే ఈ సారి అనుకున్నట్లు గా బోయపాటి శ్రీను తో కాకుండా కేఎస్ రవికుమార్ దర్శకత్వం లో ఒక చిత్రాన్ని చేయనున్నాడు బాలకృష్ణ. ఇంతకు ముందు వీళ్ళ కాంబినేషన్ లో జై సింహా చిత్రం వచ్చింది. ఇప్పుడు మరలా కలిసి పని చేయనున్నారు.

అయితే తాజా ఫిలిం నగర్ కబుర్ల ప్రకారం ఈ సినిమా లో హీరోయిన్ గా కన్నడ నటి హరిప్రియ ని తీసుకోవాలని నిర్ణయించుకున్నారట దర్శక నిర్మాతలు. బాలయ్య కూడా హరి ప్రియా వైపు మొగ్గు చూపాడట. హరిప్రియ ఇంతకు ముందు జై సింహా లో సెకండ్ హీరోయిన్ గా నటించింది. మార్కెట్ పెద్దగా లేకపోయినా అవకాశం వచ్చినప్పుడు మాత్రం అసలు వదులుకోవడం లేదు ఈ భామ.

జై సింహా పెద్ద గా తన కెరీర్ కి ఉపయోగపడకపోయినా ఇప్పుడు ఈ సినిమా ఒప్పుకొని ఏదో లాగా తెలుగు లో మరో రెండు చిత్రాలు కైవసం చేసుకోవాలి అని అనుకుంటుంది హరి ప్రియా. ఈ సినిమా పై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

First Published:  8 May 2019 4:40 AM GMT
Next Story