Telugu Global
Cinema & Entertainment

అటకెక్కిన హెబ్బా పటేల్ బోల్డ్ సినిమా

అప్పటిదాకా స్టార్ డం లేకపోయినప్పటికీ కేవలం ఒక్క సినిమా కొందరి జీవితాలను మార్చేస్తుంటుంది. హెబ్బా పటేల్ కెరీర్ లో అలాంటి సినిమా ‘కుమారి 21 ఎఫ్’ అని చెప్పుకోవచ్చు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ గా మారడంతో ఈమెకు టాలీవుడ్ నుంచి బోలెడు ఆఫర్లు వచ్చి పడ్డాయి. కానీ వరుస ఫ్లాపులతో డీలా పడిపోయింది హెబ్బ. అయినప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా రూటు మార్చి బోల్డ్ సినిమాలలో నటించడానికి సిద్ధమైంది. ఈ మధ్యనే […]

అటకెక్కిన హెబ్బా పటేల్ బోల్డ్ సినిమా
X

అప్పటిదాకా స్టార్ డం లేకపోయినప్పటికీ కేవలం ఒక్క సినిమా కొందరి జీవితాలను మార్చేస్తుంటుంది. హెబ్బా పటేల్ కెరీర్ లో అలాంటి సినిమా ‘కుమారి 21 ఎఫ్’ అని చెప్పుకోవచ్చు.

సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ గా మారడంతో ఈమెకు టాలీవుడ్ నుంచి బోలెడు ఆఫర్లు వచ్చి పడ్డాయి. కానీ వరుస ఫ్లాపులతో డీలా పడిపోయింది హెబ్బ. అయినప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా రూటు మార్చి బోల్డ్ సినిమాలలో నటించడానికి సిద్ధమైంది.

ఈ మధ్యనే ’24 కిస్సెస్’ అనే చిత్రంలో అదిత్ అరుణ్ తో లిప్ లాక్ సీన్ ల తో రెచ్చిపోయిన ఈ భామ ఎంత గ్లామరస్ గా కనిపించినా హిట్ మాత్రం కొట్టలేకపోయింది.

అయితే తాజాగా హెబ్బా పటేల్ మరొక బోల్డ్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యనే ప్రశాంత్ అనే దర్శకుడు ‘ర్యాడికల్’ అనే సినిమా తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ప్రిన్స్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో హెబ్బా పటేల్ కనిపించబోతుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కూడా హెబ్బా ది ఒక బోల్డ్ పాత్ర. ఈ సినిమాలో కూడా హెబ్బా హాట్ లుక్స్ తో ప్రేక్షకులను అలరిస్తుంది అనుకుంటే ఈ సినిమా కాస్తా ఆగిపోయిందని తెలుస్తోంది. ఇక సినిమాల సంగతి పక్కన పెట్టి వరుసగా షాపింగ్ మాల్స్ ను ఓపెన్ చేస్తూ బిజీగా ఉంది హెబ్బా.

First Published:  8 May 2019 1:06 AM GMT
Next Story