Telugu Global
NEWS

ఐపీఎల్ లీగ్ టేబుల్ ఆఖరి స్థానంలో బెంగళూరు

రాయల్ చాలెంజర్స్ ఫ్లాప్ షోతో విజయ్ మాల్యా గరంగరం కొహ్లీ నాయకత్వంలో వరుసగా 6 పరాజయాలు లీగ్ దశలోనే ముగిసిన రాయల్ చాలెంజ్ అన్నీ ఉన్నా అల్లుడినోట్ల శని అన్న సామెత…ఐపీఎల్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టుకు అతికినట్లు సరిపోతుంది. ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీ నాయకత్వంలోని బెంగళూరుజట్టులో వీరబాదుడు స్పెషలిస్ట్ ఏబీ డివిలియర్స్, ఆల్ రౌండర్ స్టోయినిస్, హిట్ మేయర్, టిమ్ సౌథీ లాంటి గొప్ప గొప్ప ఆటగాళ్లు, గ్యారీ కిర్ […]

ఐపీఎల్ లీగ్ టేబుల్ ఆఖరి స్థానంలో బెంగళూరు
X
  • రాయల్ చాలెంజర్స్ ఫ్లాప్ షోతో విజయ్ మాల్యా గరంగరం
  • కొహ్లీ నాయకత్వంలో వరుసగా 6 పరాజయాలు
  • లీగ్ దశలోనే ముగిసిన రాయల్ చాలెంజ్

అన్నీ ఉన్నా అల్లుడినోట్ల శని అన్న సామెత…ఐపీఎల్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టుకు అతికినట్లు సరిపోతుంది.

ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీ నాయకత్వంలోని బెంగళూరుజట్టులో వీరబాదుడు స్పెషలిస్ట్ ఏబీ డివిలియర్స్, ఆల్ రౌండర్ స్టోయినిస్, హిట్ మేయర్, టిమ్ సౌథీ లాంటి గొప్ప గొప్ప ఆటగాళ్లు, గ్యారీ కిర్ స్టెన్ లాంటి ప్రపంచ మేటి క్రికెట్ కోచ్ లు ఉన్నా… ప్రస్తుత 12వ సీజన్ లీగ్ లో మాత్రం.. బెంగళూరు ఆఖరి స్థానంలో నిలిచింది.

మొత్తం 14 రౌండ్ల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ తొలిదశలో వరుసగా ఆరుపరాజయాలు చవిచూసింది. ఆఖరి ఏడురౌండ్ల లో ఐదు విజయాలు సాధించినా.. ఆఖరి స్థానంతోనే సరిపెట్టుకోక తప్పలేదు.

కొహ్లీ అలా-మాల్యా ఇలా….

ఐపీఎల్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ రికార్డు సీజన్ సీజన్ కూ దిగజారిపోతూ వస్తోంది. క్రిస్ గేల్, కొహ్లీ, డివిలియర్స్ లాంటి గొప్పగొప్ప మొనగాళ్ళున్నా…నానాటికీ తీసికట్టుగా తయారవుతూ వస్తోంది. గత 12 సీజన్లలో రన్నరప్ గా మాత్రమే మిగలగలిగింది. అత్యంత ఖరీదైన ఆటగాళ్లున్నా సాధించింది అంతంత మాత్రమే. ప్రస్తుత 12వ సీజన్లో సైతం దారుణంగా విఫలమయ్యింది.

మొత్తం 14 రౌండ్లలో….5 విజయాలు, 8 పరాజయాలతో 11 పాయింట్లు సాధించడం ద్వారా ఆఖరి స్థానంతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

అయితే…కెప్టెన్ కొహ్లీ మాత్రం…తమజట్టు ఆటతీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. ఆఖరి 7రౌండ్లలో తమజట్టు 5 విజయాలు సాధించడం గర్వకారణమని.. వచ్చే సీజన్లో టైటిల్ సాధిస్తామని ధీమాగా చెప్పాడు.

మరోవైపు…రాయల్ చాలెంజర్స్ ఫ్రాంచైజీ మాజీ ఓనర్ విజయ్ మాల్యా మాత్రం…తమజట్టు ప్రదర్శన తనకు తీవ్రనిరాశ కలిగించిందని, ఆఖరిస్థానంలో మిగలటం బాధాకరమని వాపోయాడు. పేపర్ మీద తమజట్టు ఉన్నంత బలంగా…ఫీల్డ్ లో ఉండదంటూ ట్విట్టర్ ద్వారా తన అసంతృప్తిని వెళ్లగక్కాడు.

మొత్తం మీద విరాట్ కొహ్లీ నాయకత్వంలోని బెంగళూరు రాయల్ చాలెంజర్స్…పరిస్థితి పేరుగొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా మిగిలిపోయింది.

First Published:  8 May 2019 12:50 AM GMT
Next Story