Telugu Global
Cinema & Entertainment

మహర్షితో చేతులు కలిపిన సీత

కేవలం మహర్షి సినిమా హవాకు భయపడి వాయిదాపడింది సీత సినిమా. అలాంటి మూవీ ఇప్పుడు ఏకంగా మహర్షి సినిమాతో చేతులు కలిపింది. మహర్షి మేనియాను తమ సినిమాకు వాడుకోవాలని ఫిక్స్ అయ్యారు సీత మేకర్స్. ఈ మేరకు ఒప్పందాలు జరిగిపోయాయి. అవును.. రేపట్నుంచి మహర్షి సినిమా ప్రదర్శిస్తున్న అన్ని థియేటర్లలో సీత ట్రయిలర్ ను ప్రసారం చేయబోతున్నారు.  బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ హీరోహీరోయిన్లుగా నటించిన సీత సినిమాకు తేజ దర్శకుడు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ […]

మహర్షితో చేతులు కలిపిన సీత
X

కేవలం మహర్షి సినిమా హవాకు భయపడి వాయిదాపడింది సీత సినిమా. అలాంటి మూవీ ఇప్పుడు ఏకంగా మహర్షి సినిమాతో చేతులు కలిపింది. మహర్షి మేనియాను తమ సినిమాకు వాడుకోవాలని ఫిక్స్ అయ్యారు సీత మేకర్స్. ఈ మేరకు ఒప్పందాలు జరిగిపోయాయి. అవును.. రేపట్నుంచి మహర్షి సినిమా ప్రదర్శిస్తున్న అన్ని థియేటర్లలో సీత ట్రయిలర్ ను ప్రసారం చేయబోతున్నారు.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ హీరోహీరోయిన్లుగా నటించిన సీత సినిమాకు తేజ దర్శకుడు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర నిర్మించిన ఈ సినిమాకు బిజినెస్ సరిగ్గా జరగడం లేదు. బెల్లంకొండ గత చిత్రాలు డిజాస్టర్లుగా నిలవడంతో సీతను కొనేందుకు బయ్యర్లు భారీ ఆఫర్లు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో సినిమాకు ఇంకాస్త క్రేజ్ తీసుకొచ్చేందుకు, ఇలా మహర్షి మూవీతో పాటు సీత ట్రయిలర్ ను ప్రసారం చేయాలని నిర్ణయించారు.

ఈనెల 24న థియేటర్లలోకి రాబోతోంది సీత సినిమా. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా మన్నారా చోప్రా నటించింది. సోనూసూద్ మరోసారి ఈ సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

First Published:  8 May 2019 6:38 AM GMT
Next Story