Telugu Global
Cinema & Entertainment

నిర్మాత నితిన్ .... హీరోయిన్ నిత్య మీనన్.... డైరెక్టర్ విశ్వక్సేన్ !

తెలుగు సినిమా పరిశ్రమ లో ప్రస్తుతం నితిన్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఒక ప్రాజెక్ట్ తర్వాత మరో ప్రాజెక్ట్ ను ప్రకటించి అందరి చూపు ని తన వైపుకి తిప్పుకున్నాడు నితిన్. అయితే హీరో గా నే కాకుండా ఈ సంవత్సరం నిర్మాత గా కూడా బిజీ అవ్వాలని చూస్తున్నాడు ఈ హీరో. అందుకే కొంత గాప్ తీసుకొని వైవిధ్యమైన ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు నితిన్. ప్రస్తుతం ఇండస్ట్రీ […]

నిర్మాత నితిన్ .... హీరోయిన్ నిత్య మీనన్.... డైరెక్టర్ విశ్వక్సేన్ !
X

తెలుగు సినిమా పరిశ్రమ లో ప్రస్తుతం నితిన్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఒక ప్రాజెక్ట్ తర్వాత మరో ప్రాజెక్ట్ ను ప్రకటించి అందరి చూపు ని తన వైపుకి తిప్పుకున్నాడు నితిన్.

అయితే హీరో గా నే కాకుండా ఈ సంవత్సరం నిర్మాత గా కూడా బిజీ అవ్వాలని చూస్తున్నాడు ఈ హీరో. అందుకే కొంత గాప్ తీసుకొని వైవిధ్యమైన ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు నితిన్.

ప్రస్తుతం ఇండస్ట్రీ లో జరుగుతున్న చర్చ ప్రకారం నితిన్ ఒక కొత్త చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఈ సినిమా కి దర్శకుడు విశ్వక్సేన్. విశ్వక్సేన్ ‘వెళ్ళిపోమాకే’ సినిమా తో హీరో గా మారి, ఆ తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’ లో నటించి ఇటీవలే ఫలక్నూమా దాస్ చిత్రం తో దర్శకుడి గా మారాడు.

ఈ యువ దర్శకుడి రెండో చిత్రానికి నితిన్ నిర్మాత గా మారనున్నాడు. అయితే ఈ చిత్రం ఫిమేల్ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ గా మారనుందట. ఇందులో నిత్య మీనన్ ప్రధాన పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్వక్సేన్ కూడా ఈ చిత్రం లో ఒక కీలక పాత్ర లో మెరవనున్నాడట. ఫలక్నూమా దాస్ విడుదల అనంతరం ఈ కొత్త చిత్రం ప్రారంభం అవుతుంది.

First Published:  8 May 2019 1:35 AM GMT
Next Story