Telugu Global
Cinema & Entertainment

'మహర్షి' సినిమా పై సుకుమార్ కామెంట్స్

మహేష్ బాబు 25 వ చిత్రం మహర్షి సినిమా మే 9న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు నిజానికి సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. అప్పటి నుంచి మహేష్, సుకుమార్ మధ్య గొడవ అయిందని, వారిద్దరూ స్నేహంగా ఉండటం లేదని వార్తలు బయటకు వచ్చాయి. మొన్నటికి మొన్న ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సైతం మహేష్ బాబు […]

మహర్షి సినిమా పై సుకుమార్ కామెంట్స్
X

మహేష్ బాబు 25 వ చిత్రం మహర్షి సినిమా మే 9న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు నిజానికి సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది.

అప్పటి నుంచి మహేష్, సుకుమార్ మధ్య గొడవ అయిందని, వారిద్దరూ స్నేహంగా ఉండటం లేదని వార్తలు బయటకు వచ్చాయి. మొన్నటికి మొన్న ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సైతం మహేష్ బాబు సుకుమార్ పేరు ఎత్తకుండానే ఆయనపై సెటైర్లు వేశాడు.

అయితే తాజాగా మహేష్ బాబు సుకుమార్ మధ్య ఎలాంటి గొడవలు లేవని తెలుస్తోంది. దానికి నమ్రత షేర్ చేసిన ఒక వీడియోనేని చెబుతున్నారు. ఆ వీడియోలో సుకుమార్ ‘మహర్షి’ సినిమా గురించి చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

సుకుమార్ తాను ఒకసారి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సెట్స్ కు వెళ్లానని అక్కడ మహేష్ బాబు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో స్కూల్ స్టూడెంట్ లాగా ప్రశ్నలు అడుగుతున్నాడని, మహేష్ బాబు దేనితోనూ తృప్తి పడకుండా ప్రతి షాట్ లోనూ ఇంకా బాగా చేయడానికి ప్రయత్నిస్తాడని చెప్పుకొచ్చాడు సుకుమార్. అంతేకాకుండా ‘మహర్షి’ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు.

First Published:  7 May 2019 10:51 PM GMT
Next Story