Telugu Global
Cinema & Entertainment

మరో బయోపిక్ లో విద్యాబాలన్

విద్యాబాలన్ కు బయోపిక్స్ కొత్తకాదు. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన డర్టీ పిక్చర్ లో నటించి అందరితో శభాష్ అనిపించుకుంది. రీసెంట్ గా వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా కీలక పాత్ర పోషించింది. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాల్లో విద్యాబాలన్ పాత్ర చాలా ప్రముఖమైంది. ఇప్పుడీ హీరోయిన్ మరో బయోపిక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రముఖ గణిత శాస్త్రవేత్త శకుంతల దేవి బయోపిక్ లో నటించడానికి ఒప్పుకుంది విద్యాబాలన్. శకుంతల దేవికి […]

మరో బయోపిక్ లో విద్యాబాలన్
X

విద్యాబాలన్ కు బయోపిక్స్ కొత్తకాదు. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన డర్టీ పిక్చర్ లో నటించి అందరితో శభాష్ అనిపించుకుంది. రీసెంట్ గా వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా కీలక పాత్ర పోషించింది. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాల్లో విద్యాబాలన్ పాత్ర చాలా ప్రముఖమైంది. ఇప్పుడీ హీరోయిన్ మరో బయోపిక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ప్రముఖ గణిత శాస్త్రవేత్త శకుంతల దేవి బయోపిక్ లో నటించడానికి ఒప్పుకుంది విద్యాబాలన్. శకుంతల దేవికి ఇండియన్ హ్యూమన్ కంప్యూటర్ గా పేరుంది. ఎంత పెద్ద సమస్యనైనా ఆమె చిటికెలో పరిష్కరిస్తారు. గిన్నిస్ బుక్ లోకి కూడా ఎక్కిన ఆమె భారతదేశం పేరును ప్రపంచస్థాయిలో మారుమోగేలా చేశారు. ఆరేళ్ల కిందట కన్నుమూసిన శకుంతలా దేవి జీవితాన్ని బయోపిక్ గా తీసుకురాబోతున్నారు.

దర్శకులు అను మీనన్ ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేశారు. శకుంతల దేవిగా విద్యాబాలన్ సరిపోతుందనే ఉద్దేశంతో ఆమెను సంప్రదించారు. కథ విన్న వెంటనే నటించడానికి ఒప్పుకుంది విద్యాబాలన్. విక్రమ్ మల్హోత్రా నిర్మాతగా ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది. 2020 వేసవికి సినిమాను విడుదల చేయబోతున్నారు.

First Published:  8 May 2019 9:00 AM GMT
Next Story