Telugu Global
Cinema & Entertainment

తన భర్త గురించి సంచలన విషయాలు చెప్పిన 'అమృతం' నటి

ఒకవైపు టీవీ సీరియళ్లలో నటిస్తూనే మరొకవైపు సినిమాల్లో అడపదడపా పాత్రలు చేస్తూ ప్రేక్షకులకు లో మంచి పేరు తెచ్చుకుంది రాగిణి. ‘అమృతం’ సీరియల్ తో విజయం సాధించిన ఈమె కు అప్పట్లో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బోలెడు ఆఫర్లు వచ్చాయి. తాజాగా ఈమె ఒక యూట్యూబ్ ఛానల్  కి ఇంటర్వ్యూ ఇచ్చింది. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఎవరికీ తెలియని కొన్ని షాకింగ్ నిజాలు బయట పెట్టింది రాగిణి. తాను చిన్నతనం నుంచే చాలా కష్టాలను […]

తన భర్త గురించి సంచలన విషయాలు చెప్పిన అమృతం నటి
X

ఒకవైపు టీవీ సీరియళ్లలో నటిస్తూనే మరొకవైపు సినిమాల్లో అడపదడపా పాత్రలు చేస్తూ ప్రేక్షకులకు లో మంచి పేరు తెచ్చుకుంది రాగిణి.

‘అమృతం’ సీరియల్ తో విజయం సాధించిన ఈమె కు అప్పట్లో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బోలెడు ఆఫర్లు వచ్చాయి. తాజాగా ఈమె ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఎవరికీ తెలియని కొన్ని షాకింగ్ నిజాలు బయట పెట్టింది రాగిణి.

తాను చిన్నతనం నుంచే చాలా కష్టాలను అనుభవించానని, తండ్రి కి పక్షవాతం రావడంతో డాన్స్ ప్రదర్శనలు ఇస్తూ ఇంటి ఖర్చు కూడా చూసుకునేదాన్ని అని చెప్పుకొచ్చింది.

అంతేకాక పన్నెండేళ్ళ వయసులోనే తాను పెళ్లి చేసుకున్నానని, కానీ తన భర్త కి యాక్టింగ్ ఫీల్డ్ పై నమ్మకం లేకపోవడం వల్ల చాలా హింసించే వాడని చెప్పుకొచ్చింది. పెళ్లయిన ఆరు నెలలకే తప్పుడు దారిలో వెళ్ళినా సరే డబ్బులు సంపాదించాలని వేధించేవాడని వెల్లడించింది. డబ్బుల సంపాదనకోసం ఎంతకైనా దిగజారాలంటూ బలవంతం చేసే వాడని వాపోయింది.

ఆ బాధలు భరించలేక పెళ్లయిన కొద్దిరోజులకే విడాకులు తీసుకున్నానని…. ఆ సమయంలో తన పెళ్లి ఫొటోలు అన్నీ తగలబెట్టి అతను వెళ్ళిపోయాడు అని…. అప్పటి నుంచి తన కొడుకు తోనే జీవిస్తున్నట్లు తెలిపింది రాగిణి. ప్రస్తుతం ఆమె తనయుడు జర్మనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నట్లు పేర్కొంది.

First Published:  8 May 2019 10:52 PM GMT
Next Story