Telugu Global
NEWS

నేనింతే.... మారను గాక మారను...!

ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా చంద్రబాబు ‘నేను మారనుగాక మారను‘ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అసెంబ్లీ ఎన్నికలలో విజయావకాశాలు సందేహాస్పదంగా ఉన్నప్పటికీ, “తాను పట్టిన కుందేలికి మూడే కాళ్లు” అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. నైతికంగా గానీ, ఎన్నికల నిబంధనల ప్రకారం గానీ ఫలితాలు రావడానికి ముందు కేబినెట్ సమావేశం పెట్టడం వాంఛనీయం కాదని, ఇంత వరకూ ఏ నాయకుడు కూడా ఇలా చేయలేదని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు మాత్రం 14వ తేదీన కేబినెట్ […]

నేనింతే.... మారను గాక మారను...!
X

ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా చంద్రబాబు ‘నేను మారనుగాక మారను‘ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అసెంబ్లీ ఎన్నికలలో విజయావకాశాలు సందేహాస్పదంగా ఉన్నప్పటికీ, “తాను పట్టిన కుందేలికి మూడే కాళ్లు” అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.

నైతికంగా గానీ, ఎన్నికల నిబంధనల ప్రకారం గానీ ఫలితాలు రావడానికి ముందు కేబినెట్ సమావేశం పెట్టడం వాంఛనీయం కాదని, ఇంత వరకూ ఏ నాయకుడు కూడా ఇలా చేయలేదని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు మాత్రం 14వ తేదీన కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తానని పంతానికి పోవడం అంత మంచిది కాదని అంటున్నారు. ఇది భవిష్యత్తులో దుస్సంప్రదాయాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఎన్నికల సంఘం కొత్త సీఎస్ ను నియమించినప్పటి నుంచీ సీఎంకూ, సీఎస్ కూ పొంతన కుదరడం లేదు. ఇప్పుడు కేబినెట్ సమావేశ విషయం కూడా వివాదాస్పదంగా మారుతుందేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇప్పటికే కేబినెట్ సమావేశం కోసం నివేదికలు పంపాలని అన్ని శాఖలకు ఆదేశాలు
ఇచ్చారని అంటున్నారు. అయితే ఆ నివేదికలను స్ర్కీనింగ్ కమిటీ పరిశీలించాకే, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే కేబినెట్ ఎజెండాలో పెడతామని సీఎస్ చెబుతున్నారట. దీనిని చంద్రబాబు ఏ మేరకు అంగీకరిస్తారో వేచి చూడాల్సిందే.

మరోవైపు మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన కిడారి సర్వేశ్వర్ రావు కుమారుడు కిరణ్ కుమార్ తో మంత్రి పదవికి రాజీనామా చేయించాలని గవర్నర్ నరసింహన్ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. కిరణ్ మంత్రి పదవిని స్వీకరించి ఆరు నెలలు కావస్తోంది. ఇంత వరకు ఆయన అటు అసెంబ్లీలోనూ, ఇటు మండలిలోనూ సభ్యుడు కాలేదు. దీంతో మంత్రి పదవిని తప్పనిసరిగా వదులుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.

నిజానికి గవర్నర్ లేఖ రాయక ముందే కిరణ్ చేత రాజీనామా చేయించి ఉండాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ పరిస్థితి తలెత్తకుండా ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందే మండలి సభ్యుడిగా కిరణ్ కు అవకాశం కల్పించి ఉండాల్సిందని అంటున్నారు.

1994లో నందమూరి హరికృష్ట కూడా ఇలాగే రాజీనామా చేసిన విషయాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు తీరే అంత అని, ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా తాను చేయదలుచుకున్నదే చేస్తాడని అంటున్నారు.

First Published:  8 May 2019 11:14 PM GMT
Next Story