Telugu Global
NEWS

సర్వేలతో కుస్తీ పడుతున్న చంద్రబాబు

అటు పార్టీ సమావేశాలలోనూ, ఇటు సన్నిహిత నాయకులతోనూ, మరో వైపు మీడియాతోనూ…. తెలుగుదేశం గెలిచి తీరుతుందని, ఎన్నికల ఫలితాలు తమకే అనుకూలంగా వస్తాయని బీరాలు పోతున్న చంద్రబాబు ఇంకా సర్వేలతో కుస్తీ పడుతూనే ఉన్నారట. అధినేతను ప్రసన్నం చేసుకునేందుకో, మరెందుకో తెలియదు గానీ కొందరు టీడీపీ నేతలు వ్యక్తిగతంగా బాబును కలుసుకుని తాము గెలవబోతున్నామని సర్వేలో తేలిందంటూ నివేదికలు సమర్పిస్తున్నారట. ఈ నివేదికలను చంద్రబాబు ఆసక్తిగా చదువుతున్నారని అంటున్నారు. ఈ వ్యవహారంపై కొందరు తెలుగు తమ్ముళ్లు ఆశ్చర్యం వ్యక్తం […]

సర్వేలతో కుస్తీ పడుతున్న చంద్రబాబు
X

అటు పార్టీ సమావేశాలలోనూ, ఇటు సన్నిహిత నాయకులతోనూ, మరో వైపు మీడియాతోనూ…. తెలుగుదేశం గెలిచి తీరుతుందని, ఎన్నికల ఫలితాలు తమకే అనుకూలంగా వస్తాయని బీరాలు పోతున్న చంద్రబాబు ఇంకా సర్వేలతో కుస్తీ పడుతూనే ఉన్నారట.

అధినేతను ప్రసన్నం చేసుకునేందుకో, మరెందుకో తెలియదు గానీ కొందరు టీడీపీ నేతలు వ్యక్తిగతంగా బాబును కలుసుకుని తాము గెలవబోతున్నామని సర్వేలో తేలిందంటూ నివేదికలు సమర్పిస్తున్నారట.

ఈ నివేదికలను చంద్రబాబు ఆసక్తిగా చదువుతున్నారని అంటున్నారు. ఈ వ్యవహారంపై కొందరు తెలుగు తమ్ముళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు స్వయంగా తాను చేయించుకున్న సర్వే ప్రకారం విజయం తమదే అంటూ చెబుతున్నారని, ఇప్పుడు కొందరు వ్యక్తిగతంగా చేయించుకున్న సర్వేలకు బాబు ఎందుకంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం కావడం లేదంటున్నారట.

అంటే ఆయనకు విజయం మీద అనుమానాలు ఉన్నాయని దీంతో స్పష్టం అవుతోందని అంటున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే సోషల్ మీడియాలో టీడీపీకి, తనకు వ్యతిరేకంగా వచ్చే పోస్టులను కూడా సేకరించి బేరీజు వేయాలని తమ ఐటీ వింగ్ ను ఆదేశించారని చెబుతున్నారు.

ఇందులో తమ పట్ల వ్యతిరేకత ఏ మేరకు ఉందో అంచనా వేయగలిగితే, విజయావకాశాల మీద ఓ నిర్ధారణకు రావచ్చని చంద్రబాబు భావిస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు ఈసారి ఎన్నికలలో టీడీపీ ఒంటరిగా పోటీ చేసినందున పార్టీ నాయకులు చాలా మందికి అవకాశాలు దక్కాయని, ఈ అంశం కూడా తమను గెలుపు తీరాలకు చేరుస్తుందని బాబు నమ్ముతున్నారని అంటున్నారు.

ఈ సంగతి ఎలా ఉన్నా, తమ మిత్రుడే అని నెత్తికెక్కించుకున్న పవన్ పార్టీ జనసేన ఎవరి కొంప ముంచిందో తెలియడం లేదని టీడీపీ శ్రేణులు వాపోతున్నాయి. పవన్ కు రెండో, మూడో సీట్లు వస్తే తమకు ఉపయోగపడతాడనే ఆలోచన చంద్రబాబులో ఉందని చెబుతున్నారు.

ఆయన పార్టీకి వచ్చే ఒకటి, రెండు సీట్లకు ఆశ పడితే, చాలా సీట్లలో పవన్ చీల్చిన ఓట్లు వైసీపీకి ఎక్కడ లాభం చేకూరుస్తాయోనని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారట.

First Published:  8 May 2019 9:32 PM GMT
Next Story