Telugu Global
Cinema & Entertainment

'మహర్షి' సినిమా రివ్యూ

రివ్యూ: మహర్షి రేటింగ్‌: 2.5/5 తారాగణం: మహేష్ బాబు, పూజా హెగ్డే, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, జయ సుధ తదితరులు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ నిర్మాత: దిల్ రాజు, అశ్వినీదత్, పివీపి దర్శకత్వం:  వంశీ పైడిపల్లి సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25 వ చిత్రం కోసం ఎప్పటి నుండో వేచి చూస్తున్నాడు. అభిమానులు కూడా ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం రెడీ గా ఉన్న సంగతి తెలిసిందే. తన గత చిత్రం భరత్ అనే నేను తర్వాత వంశీ పైడిపల్లి తో ‘మహర్షి’అనే […]

మహర్షి సినిమా రివ్యూ
X

రివ్యూ: మహర్షి
రేటింగ్‌: 2.5/5
తారాగణం: మహేష్ బాబు, పూజా హెగ్డే, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, జయ సుధ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత: దిల్ రాజు, అశ్వినీదత్, పివీపి
దర్శకత్వం: వంశీ పైడిపల్లి

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25 వ చిత్రం కోసం ఎప్పటి నుండో వేచి చూస్తున్నాడు. అభిమానులు కూడా ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం రెడీ గా ఉన్న సంగతి తెలిసిందే. తన గత చిత్రం భరత్ అనే నేను తర్వాత వంశీ పైడిపల్లి తో ‘మహర్షి’అనే చిత్రాన్ని ఆరంభించాడు మహేష్.

రిషి అనే పాత్రతో పాటు ఈ సినిమా లో మహేష్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనుండటం విశేషం. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని దిల్ రాజు, పీవీపీ, అశ్విని దత్ సంయుక్తంగా నిర్మించారు. ట్రైలర్ విడుదల నుండి ఈ సినిమా మీద ఆసక్తి, అంచనాలు అమాంతం పెరిగిపోయిన విషయం వాస్తవం.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో అల్లరి నరేష్ ఒక కీలక పాత్రని పోషించాడు. జగపతి బాబు, ప్రకాష్ రాజ్, జయ సుధ, రాజీవ్ కనకాల, కమల్ కామరాజు తదితరులు ఈ సినిమా లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా నేడు అత్యధిక థియేటర్లలో విడుదల అయింది.

కథ:

రిషి కుమార్ (మహేష్ బాబు) అనే ఒక మధ్య తరగతి యువకుడి కథ ఈ మహర్షి. పెద్ద పెద్ద ఆశలతో జీవితం లో పైకి రావాలని తపన పడే రిషి కుమార్ మొత్తానికి తాను అనుకున్నది సాధించుకొని ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన బిసినెస్ మాన్ గా ఎదుగుతాడు. తన జీవితాన్ని మూడు విభిన్న కోణాల్లో ఆవిష్కరించాడు దర్శకుడు.

సంతోషం గా సాగుతున్న తన జీవితం లో ఒక అనుకోని సంఘటన బాగా ప్రభావితం చేస్తుంది. అమెరికాలో సెటిల్ అయిన తనని తిరిగి భారత దేశానికి తీసుకొని వస్తుంది. ఇక్కడి రైతుల కోసం నిలబడేలా చేస్తుంది. అసలు అదేం సంఘటన? రిషి కుమార్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది? చివరికి ఏమైంది? రిషి కుమార్ మహర్షి ఎలా అయ్యాడు? అనేది మిగిలిన కథ!

అభిమానుల కి మాత్రం ఇదొక మంచి సినిమా అని చెప్పచ్చు. తన నటన తో మహేష్ బాబు అభిమానులని థ్రిల్ చేశాడు. ప్రతీ షేడ్ ని ఎంతో వైవిధ్యం గా పోషించడం లో మహేష్ మరో సారి దిట్ట అని నిరూపించుకున్నాడు. కాలేజ్ స్టూడెంట్ గా, బిజినెస్ మాన్ గా, రైతుల కోసం పోరాడే వాడిగా, ఇలా మూడు వేరియేషన్స్ ని చక్కగా కనబరిచాడు మహేష్.

ఇక కామెడీ ని కూడా తనదైన శైలి లో పండించాడు మహేష్. మొత్తానికి ప్రతిష్టాత్మక సినిమా ని అంతే ప్రతిష్టాత్మకం గా తన నటన తో ఒక మెట్టు ఎక్కించాడు మహేష్.

అల్లరి నరేష్ తన కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఈ సినిమా లో ఇచ్చాడు అని చెప్పుకోవచ్చు. తన పాత్ర స్వభావానికి తగ్గట్టు నరేష్ తనని తాను మలుచుకున్న విధానం బాగుంది. ఈ సినిమా తప్పకుండా నరేష్ కి ఉపయోగపడుతుంది అని చెప్పడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

హీరోయిన్ పూజ హెగ్డే చక్కటి పాత్ర ని పోషించింది. తన అందం, నటన తో అందరినీ మెప్పిస్తుంది. జగపతి బాబు తన పాత్ర కి న్యాయం చేకూర్చాడు. అలాగే ప్రకాష్ రాజ్, జయసుధ, ఇంకా ఇతర నటులు కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:

మోహనన్ కెమెరా పనితనం ఈ సినిమా కి ప్రధాన ఆకర్షణ. హిందీ లో ‘బ్లాక్ బస్టర్స్’ కి పని చేసిన అతను ఈ సినిమా కి పని చేసి తన వాల్యూ ని యాడ్ చేశారు. ఆయన లైటింగ్ విధానం, స్క్రీన్ పై చూపించిన కలర్స్, అందమైన విజువల్స్ సినిమా కి ప్రధాన ఆకర్షణ. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం తో పెద్దగా మెప్పించకపోయినా నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు.

సినిమాని మంచి స్థాయి లో నిలబెట్టాడు. ఎడిటింగ్ కూడా చాలా క్రిస్ప్ గా ఉంది. బోరింగ్ సన్నివేశాలు ఎక్కడా కనిపించలేదు. అందరూ నటీ నటులు తమ పని తీరు తో సినిమా ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్లారు.

కథ ని, కథనాన్ని వంశీ తన టీం తో కలిసి చక్కగా అమర్చుకున్నారు. కథ లో ఏ మాత్రం గజిబిజి లేకుండా చాలా క్లారిటీ గా ఉన్న దర్శకుడు, అదే క్లారిటీ తో సినిమా ని తెరకెక్కించారు. సినిమా ని నరేట్ చేసిన విధానం బాగుంది. అలాగే ఒక మనిషి జీవితాన్ని మూడు విభిన్న కోణాల్లో ఆవిష్కరించే ప్రక్రియ కూడా అబ్బురపరిచింది. స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకొనే లాగా తీర్చిదిద్దారు వంశీ. సంభాషణలు సందర్భానుసారంగా చక్కగా కుదిరాయి.

మహర్షి సినిమా ఒక చక్కటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకుల కి కావాల్సిన వినోదం ఈ సినిమా లో అందించే ప్రయత్నం చేశారు దర్శక నిర్మాతలు. ఒక వైపు యువత కి దగ్గరవుతూ, ఎమోషనల్ సన్నివేశాలతో, మనల్ని ఆలోచింపజేసేలా చేస్తుంది ఈ సినిమా. చివారాకరన రైతుల గురించి చెప్పే సంభాషణలు కానీ, గుండె ని హత్తుకొనే మెసేజ్ కానీ చాలా రిలవెంట్ గా అనిపిస్తుంది.

తన 25 వ చిత్రం గా ఈ చిత్రాన్ని ఎన్నుకున్నందుకు మహేష్ ని అభినందించకుండా ఉండలేము. చివరి మాట గా, మహర్షి మహేష్ ఇమేజ్ కి ఏ మాత్రం తీసిపోకుండా కంటెంట్ ని కమర్షియల్ వాల్యూస్ ని పర్ఫెక్ట్ గా మైంటైన్ చేస్తూ తీసిన చిత్రం. అందరికీ తప్పక నచ్చవచ్చు.

First Published:  9 May 2019 5:25 AM GMT
Next Story