Telugu Global
NEWS

అమిత్ మిశ్రా అరుదైన అవుట్

ఐపీఎల్ చరిత్రలో ఇద్దరే అవుట్  2013లో యూసుఫ్ పఠాన్ – 2019లో అమిత్ మిశ్రా భారత క్రికెట్ వేసవి వినోదం ఐపీఎల్ లో సీజన్ సీజన్ కూ అరుదైన రికార్డులు నమోదు కావటం మామూలు విషయమే. క్రికెట్లో ఓ అటగాడు అవుట్ కావటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. క్లీన్ బౌల్డ్, కాట్ బిహైండ్, స్లిప్ క్యాచ్, రనౌట్, హిట్ వికెట్, కాట్ అండ్ బౌల్డ్, హ్యండిల్డ్ ద బాల్…ఇలా బ్యాట్స్ మన్ అవుట్ కావడం మనకు తెలిసిందే. అయితే…విశాఖ ఏసీఏ […]

అమిత్ మిశ్రా అరుదైన అవుట్
X
  • ఐపీఎల్ చరిత్రలో ఇద్దరే అవుట్
  • 2013లో యూసుఫ్ పఠాన్ – 2019లో అమిత్ మిశ్రా

భారత క్రికెట్ వేసవి వినోదం ఐపీఎల్ లో సీజన్ సీజన్ కూ అరుదైన రికార్డులు నమోదు కావటం మామూలు విషయమే. క్రికెట్లో ఓ అటగాడు అవుట్ కావటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.

క్లీన్ బౌల్డ్, కాట్ బిహైండ్, స్లిప్ క్యాచ్, రనౌట్, హిట్ వికెట్, కాట్ అండ్ బౌల్డ్, హ్యండిల్డ్ ద బాల్…ఇలా బ్యాట్స్ మన్ అవుట్ కావడం మనకు తెలిసిందే.

అయితే…విశాఖ ఏసీఏ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్- హైదరాబాద్ సన్ రైజర్స్ జట్ల మధ్య ముగిసిన ఐపీఎల్ ఎలిమినేటర్ రౌండ్ మ్యాచ్ లో మాత్రం ఓ అసాధారణ అవుట్ చోటు చేసుకొంది.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో…ఆఖరి ఓవర్లో బ్యాటింగ్ కు దిగిన అమిత్ మిశ్రా..ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో బంతిని భారీషాట్ ఆడబోయి విఫలమయ్యాడు. పరుగు కోసం పిచ్ మధ్యనే పరుగెత్తాడు. క్రికెట్ నిబంధనల ప్రకారం ..పిచ్ కు కుడి లేదా ఎడమ వైపు మాత్రమే పరుగెత్తాలి. అమిత్ మిశ్రా మాత్రం నిబంధనలకు విరుద్ధంగా పిచ్ మధ్య భాగంలో పరుగెత్తడం ద్వారా…అబ్ స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ గా అవుటయ్యాడు.

ఫీల్డ్ అంపైర్లు, టీవీ అంపైర్ తర్జనభర్జనల అనంతరం అమిత్ మిశ్రాను అవుటైనట్లుగా ప్రకటించారు.

2013లో యూసుఫ్ పఠాన్…

ఐపీఎల్ మొత్తం 12 సీజన్ల చరిత్రలో…అబ్ స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ గా అవుటైన తొలి ఆటగాడిగా యూసుఫ్ పఠాన్ రికార్డుల్లో చేరాడు.

రాంచీ వేదికగా పూనే వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తరపున ఆడుతూ యూసుఫ్ పఠాన్ అవుటయ్యాడు.

ఆ తర్వాత…ఆరేళ్లకు అదే తరహాలో ఢిల్లీ క్యాపిటల్స్ లోయర్ ఆర్డర్ ప్లేయర్ అమిత్ మిశ్రా అవుట్ కావటం విశేషం.

First Published:  8 May 2019 9:30 PM GMT
Next Story