Telugu Global
Cinema & Entertainment

కల్కి కమర్షియల్ ట్రయిలర్ అదిరింది

కల్కి సినిమాకు సంబంధించి ఆఖరి నిమిషంలో ఓ వీడియో కట్ చేశారు. దానికి కమర్షియల్ ట్రయిలర్ అని పేరుపెట్టారు. మహర్షి సినిమా ఇంటర్వెల్ టైమ్ లో ఆ ట్రయిలర్ ను విడుదల చేశారు. మరికాసేపట్లో హీరో నాని కూడా ఆ ట్రయిలర్ ను అధికారికంగా విడుదల చేయబోతున్నాడు. ఇదిలా ఉండగా.. మహర్షి థియేటర్లలో కల్కి ట్రయిలర్ చూసిన ఆడియన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్ విడుదలైంది. అది చూసి అంతా […]

కల్కి కమర్షియల్ ట్రయిలర్ అదిరింది
X

కల్కి సినిమాకు సంబంధించి ఆఖరి నిమిషంలో ఓ వీడియో కట్ చేశారు. దానికి కమర్షియల్ ట్రయిలర్ అని పేరుపెట్టారు. మహర్షి సినిమా ఇంటర్వెల్ టైమ్ లో ఆ ట్రయిలర్ ను విడుదల చేశారు. మరికాసేపట్లో హీరో నాని కూడా ఆ ట్రయిలర్ ను అధికారికంగా విడుదల చేయబోతున్నాడు.

ఇదిలా ఉండగా.. మహర్షి థియేటర్లలో కల్కి ట్రయిలర్ చూసిన ఆడియన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్ విడుదలైంది. అది చూసి అంతా సీరియస్ మూవీ అనుకున్నారు. ఎప్పుడైతే ఈరోజు విడుదలైన ట్రయిలర్ చూశారో అంతా అవాక్కయ్యారు. అవును.. కల్కి ట్రయిలర్ లో సీరియస్ ఎలిమెంట్స్ తో పాటు సరదా సన్నివేశాలున్నాయి. మరీ ముఖ్యంగా చాన్నాళ్ల తర్వాత రాజశేఖర్ కామెడీ చూసిన ప్రేక్షకులకు చాలా ఫ్రెష్ ఫీలింగ్ కలిగింది. పైగా అందులో తనమీద తానే జోకులేసుకున్నాడు రాజశేఖర్. అదే పెద్ద హైలెట్.

కల్కి సినిమాకు సంబంధించి ఈ వీడియోకు కమర్షియల్ ట్రయిలర్ అని పేరుపెట్టారు. బహుశా విడుదల సమయానికి థియేట్రికల్ ట్రయిలర్ రిలీజ్ చేస్తారేమో చూడాలి. ప్రశాంత్ వర్మకు దర్శకుడిగా ఇది రెండో సినిమా. ఇంతకుముందు ఈయన “అ!” అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే.

First Published:  9 May 2019 5:20 AM GMT
Next Story