గీతా గోవిందం దర్శకుడితో మహేష్ బాబు

తప్పులు అందరూ చేస్తారు. కానీ వాటి నుంచి చాలా కొంతమంది మాత్రమే నేర్చుకుంటారు. మహేష్ బాబు కెరీర్ లో బ్లాక్ బస్టర్ లు మాత్రమే కాక డిజాస్టర్లు కూడా ఉన్నాయి.

కానీ మహేష్ మాత్రం తన ప్రతి ఫెయిల్యూర్ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే వచ్చాడు. అప్పటిదాకా కేవలం కాన్సెప్ట్ విని కథలను ఓకే చేసే మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ విషయంలో చాలా పెద్ద దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మొత్తం స్క్రిప్ట్ విన్న తరువాతే తన నిర్ణయం చెప్పాలని నిర్ణయించుకున్నాడు మహేష్.

తాజాగా ‘గీతగోవిందం’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు పరశురామ్ మహేష్ బాబు కు ఒక కథ వినిపించాడట. కథ బాగానే ఉన్నప్పటికీ బౌండ్ స్క్రిప్ట్ పూర్తయిన తరువాత అది విన్నాకే కథ ఓకే చేస్తానని మహేష్ ముందే చెప్పాడట.

ప్రస్తుతం పరశురాం స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో పడ్డాడు. మహేష్ 25వ సినిమా అయిన ‘మహర్షి’ మే 9న విడుదల కాబోతోంది. త్వరలో మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఒకవేళ పరాశురాం చెప్పిన స్క్రిప్ట్ ఓకే అయితే ఈ సినిమా తరువాత మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడు.