రష్మిక, దేవరకొండ.. మరో సినిమా

వీళ్లిద్దరూ కలిసి ఇప్పటికే ఓ సినిమా చేశారు. అది పెద్ద హిట్ అయింది. అదే గీతగోవిందం సినిమా. తాజాగా వీళ్లిద్దరూ కలిసి మరో సినిమాలో కూడా నటిస్తున్నారు. దాని పేరు డియర్ కామ్రేడ్. జులై 26న ఆ సినిమా విడుదల కాబోతోంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఈ సినిమా గురించి కాదు. విజయ్ దేవరకొండ, రష్మిక కాంబోలో రాబోతున్న మూడో సినిమా గురించి.

అవును.. వీళ్లిద్దరి కాంబోలో ముచ్చటగా మూడో సినిమా రాబోతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఆనంద్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమాకు ఓకే చెప్పాడు. కారు రేసుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. దీని కోసం ఢిల్లీలో ఆ మధ్య కారు రేసు కూడా నేర్చుకున్నాడు విజయ్. ఇప్పుడీ సినిమాలో రష్మికను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట.

కేవలం విజయ్ దేవరకొండ సినిమా కోసం మరో బడా మూవీ ఆఫర్ ను రష్మిక వదులుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే వీళ్లిద్దరి కాంబోలో రాబోతున్న మూడో సినిమాపై అఫీషియల్ గా ఎనౌన్స్ మెంట్ రానుంది. అది డియర్ కామ్రేడ్ రిజల్ట్ పై అది ఆధారపడి ఉంటుంది. ఈ సినిమా హిట్ అయితే రష్మికకు మరో ఛాన్స్ ఇవ్వడం గ్యారెంటీ.