Telugu Global
Cinema & Entertainment

పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన అంజలి

తమిళంలో మంచి నటిగా పేరు తెచ్చుకున్న అంజలి తెలుగులో కూడా చెప్పుకోదగ్గ పాత్రలే చేసింది. గత కొంతకాలంగా ‘జర్నీ’ సినిమా లో హీరో ‘జై’ తో పీకల్లోతు ప్రేమలో ఉందని వార్తలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. వారిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నట్లు కూడా కొందరు గుసాగుసలాడారు. కానీ వారిద్దరి మధ్య ప్రేమ…. పెళ్లి వరకు దారి తియ్యక ముందే ముగిసిపోయింది. కారణాలు తెలియకపోయినా వారిద్దరు బ్రేకప్ చెప్పేసుకున్నారని తెలుస్తోంది. అయితే కొన్ని రోజులుగా అంజలి వాళ్ళ […]

పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన అంజలి
X

తమిళంలో మంచి నటిగా పేరు తెచ్చుకున్న అంజలి తెలుగులో కూడా చెప్పుకోదగ్గ పాత్రలే చేసింది. గత కొంతకాలంగా ‘జర్నీ’ సినిమా లో హీరో ‘జై’ తో పీకల్లోతు ప్రేమలో ఉందని వార్తలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. వారిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నట్లు కూడా కొందరు గుసాగుసలాడారు.

కానీ వారిద్దరి మధ్య ప్రేమ…. పెళ్లి వరకు దారి తియ్యక ముందే ముగిసిపోయింది. కారణాలు తెలియకపోయినా వారిద్దరు బ్రేకప్ చెప్పేసుకున్నారని తెలుస్తోంది. అయితే కొన్ని రోజులుగా అంజలి వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ వార్తల పై రియాక్ట్ అయ్యింది అంజలి. తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచనలు లేవు అని కరాఖండిగా చెప్పేసింది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం తన నటన మీద మాత్రమే ఉందని క్లారిటీ ఇచ్చింది.

సినిమాల పరంగా అంజలి చేతిలో కొన్ని తెలుగు, తమిళ సినిమాలు ఉన్నాయి. అంజలి త్వరలో ‘లిసా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్న ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానుంది. ఈ సినిమా కాకుండా అంజలి చేతిలో ఇంకా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి.

First Published:  10 May 2019 12:25 AM GMT
Next Story