ఈ జిల్లాలో జగన్ ప్రభంజనం

కడప.. వైఎస్… ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా. ఈసారి ఈ జిల్లాలో వైసీపీ విజయకేతనం ఎగరవేయడం ఖాయంగా కనిపిస్తోందని పోలింగ్ సరళిని బట్టి అర్థమవుతోంది. పోలింగ్ సరళి పరిశీలించాక మాత్రం వైసీపీలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. వైసీపీ మేనిఫెస్టో, జగన్ వేవ్ పనిచేసిందని.. టీడీపీ విజయావకాశాలను ఇవే దెబ్బతీశాయని ప్రచారం జరుగుతోంది.

జగన్ సొంత జిల్లా కావడంతో పకడ్బందీగా వైసీపీ నేతలు ముందుకెళ్లారు. దీంతో ఈసారి కడప జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్‌ చేస్తామన్న అంచనాకు వచ్చేశారట.. చూడాలి మరి మే 23న ఎలాంటి ఫలితం వస్తుందో.

నిజానికి కడప జిల్లా వైఎస్ అధికారంలోకి రాకముందు నుంచి టీడీపీకి మంచి పట్టే ఉండేది. 2004 వరకు కడప జిల్లాలో టీడీపీ ఆధిపత్యం కొనసాగింది.. వైఎస్, మైసూరా, డీఎల్ వంటి బలమైన నేతలున్నా కూడా అప్పట్లో టీడీపీ మెజార్టీ సీట్లు సాధించింది. కానీ ఆ తర్వాత టీడీపీ హవా తగ్గుతూ వస్తోంది.

2004లో కడపలో టీడీపీ 2 స్థానాలకే పరిమితమైంది. 2009లో ఒకే ఒక్కస్థానం.. 2014లోనూ ఒకే స్థానానికి టీడీపీ చాపచుట్టేసింది. రాజంపేట ఒక్కటే గెలిచి పరువు దక్కించుకుంది టీడీపీ. 2004 తర్వాత టీడీపీకి కోలుకునే అవకాశం ఇవ్వలేదు వైఎస్‌ కుటుంబం.

2019 ఎన్నికల్లో జగన్ కు సొంత జిల్లా అయిన కడపలో వైసీపీకే ప్రజలు పట్టం కట్టబోతున్నారన్న అంచనాకు వైసీపీ వర్గాలు వచ్చాయి. పోలింగ్ సరళి ఫ్యాన్ కే అనుకూలంగా ఉందని…. వైసీపీ నేతల పోల్ మేనేజ్ మెంట్ ఫలితం కనిపించిందని నేతలు ధీమాగా ఉన్నారు.

2014 ఎన్నికలు.. టీడీపీ అధికారంలోకి వచ్చిదంటే గోదావరి జిల్లాలే కారణం.. పశ్చిమగోదావరి జిల్లా మొత్తం టీడీపీ గెలిచేసింది. 15 సీట్లు టీడీపీ గెలుపులో కీలకంగా మారాయి.

ఇప్పుడు 2019 ఎన్నికల్లో ఈ రెండు గోదావరి జిల్లాలే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీని నిర్ణయిస్తాయని…. ఈ రెండు జిల్లాల్లోనూ ఈసారి అధిక స్థానాలు వైసీపీ గెలుచుకుంటుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.. ఇప్పుడు రాయలసీమలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేలానే ఉంది. కడపతోపాటు కర్నూలు, చిత్తూరు, నెల్లూరు , ప్రకాశంలలో వైసీపీ ప్రాబల్యం గణనీయంగా ఉందంటున్నారు.