Telugu Global
NEWS

అదే జరిగితే.. పవన్ పరిస్థితేంటి?

ఏపీలో మే 23న ఫలితాలు రాబోతున్నాయి. ఆ తర్వాత పరిస్థితులన్నీ మారిపోతాయి.. ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలవుతాయని ఇప్పటికే అర్థమైంది. కానీ జనసేన పరిస్థితి ఏంటి? ఆ పార్టీ అధినేత పవన్ నెక్ట్స్ ఏం చేస్తారనే ఆసక్తి ప్రస్తుతం రాజకీయవర్గాల్లో సాగుతోంది. ప్రస్తుతం అన్ని సర్వేలు ఏపీలో జనసేనకు 5 సీట్లకు మించి రావని స్పష్టమవుతోంది. దీంతో పవన్ రాజకీయాల్లో కొనసాగుతారా.? లేదా మళ్లీ సినిమాల వైపు అడుగులు వేస్తారా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే […]

అదే జరిగితే.. పవన్ పరిస్థితేంటి?
X

ఏపీలో మే 23న ఫలితాలు రాబోతున్నాయి. ఆ తర్వాత పరిస్థితులన్నీ మారిపోతాయి.. ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలవుతాయని ఇప్పటికే అర్థమైంది. కానీ జనసేన పరిస్థితి ఏంటి? ఆ పార్టీ అధినేత పవన్ నెక్ట్స్ ఏం చేస్తారనే ఆసక్తి ప్రస్తుతం రాజకీయవర్గాల్లో సాగుతోంది.

ప్రస్తుతం అన్ని సర్వేలు ఏపీలో జనసేనకు 5 సీట్లకు మించి రావని స్పష్టమవుతోంది. దీంతో పవన్ రాజకీయాల్లో కొనసాగుతారా.? లేదా మళ్లీ సినిమాల వైపు అడుగులు వేస్తారా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది.

ఇప్పటికే పవన్ కోసం కొందరు బడా ప్రొడ్యూసర్లు దర్శకులతో చెప్పి మంచి కథలు రెడీ చేసినట్లు టాలీవుడ్ నుంచి వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మళ్లీ సినిమాల వైపు తొంగిచూస్తారా లేదా అన్నది వేచిచూడాలి.

అయితే సినిమాలంటే ఇష్టంలేదని రాజకీయాల్లోనే కొనసాగుతానని పవన్ చాలా సార్లు చెప్పుకొచ్చారు. కానీ రాజకీయంగా ఆయనకు అంత పురోగతి లేదని అర్థమవుతోంది. ఈ ఎన్నికల్లో పవన్ పార్టీకి తగినంత సీట్లు రావని సర్వేలన్నీ ఘోషిస్తున్నాయి. పైగా పవన్ కూడా ప్రచారాన్ని సీరియస్ గా చేయలేదు.. వారం చేస్తే రెండు రోజులు రెస్ట్ తీసుకునేవారు. జనసేన ప్రభావం కూడా ఏపీలో తక్కువే.

ఇలా పవన్ అటు రాజకీయాల్లోనూ యాక్టివ్ కాక మరి సినిమాల్లోకి రాక ఏం చేస్తారన్న ఆందోళన ఆయన అభిమానులను వెంటాడుతోంది.

అయితే ఇకనుంచి సినిమాలు చేసినా తన సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతుందని పవన్‌ కళ్యాణ్‌ అభిప్రాయపడుతున్నాడట. రాజకీయాల్లోకి వచ్చాక అభిమానులు ఎంతగా ఆదరించినా…. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు దూరం అవుతారని…. అలాగే చాలా మంది అభిమాన ప్రేక్షకులను కోల్పోతామని…. ఒక వేళ సినిమాలు తీసినా గతంలో తనను ఆదరించినంతమంది భవిష్యత్తులో ఆదరించకపోవచ్చని పవన్‌ కళ్యాణ్‌ అభిప్రాయపడుతున్నాడట.

First Published:  9 May 2019 9:36 PM GMT
Next Story