Telugu Global
Cinema & Entertainment

మళ్లీ వెండితెరపై కనిపించబోతున్న సంపూర్ణేష్ బాబు

టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ‘హృదయ కాలేయం’ సినిమా తో హీరోగా మారిపోయాడు. అప్పటినుండి కామెడీ చిత్రాల లో కనిపిస్తూ వస్తున్న సంపూ బిగ్ బాస్ తర్వాత మళ్లీ వెండి తెరపై కనిపించలేదు. సంపూర్ణేష్ నటించిన ‘కొబ్బరిమట్ట’ సినిమా ఎప్పుడో విడుదల కావాలి. కానీ షూటింగ్ పూర్తి అయినప్పటికీ ఈ సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు. తాజాగా సంపూర్ణేష్ బాబు తన పుట్టినరోజు జరుపుకున్నారు. అభిమానులు కూడా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజా […]

మళ్లీ వెండితెరపై కనిపించబోతున్న సంపూర్ణేష్ బాబు
X

టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ‘హృదయ కాలేయం’ సినిమా తో హీరోగా మారిపోయాడు. అప్పటినుండి కామెడీ చిత్రాల లో కనిపిస్తూ వస్తున్న సంపూ బిగ్ బాస్ తర్వాత మళ్లీ వెండి తెరపై కనిపించలేదు.

సంపూర్ణేష్ నటించిన ‘కొబ్బరిమట్ట’ సినిమా ఎప్పుడో విడుదల కావాలి. కానీ షూటింగ్ పూర్తి అయినప్పటికీ ఈ సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు.

తాజాగా సంపూర్ణేష్ బాబు తన పుట్టినరోజు జరుపుకున్నారు. అభిమానులు కూడా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తాజా సమాచారం ప్రకారం ‘కొబ్బరి మట్ట’ సినిమా త్వరలో విడుదల కాబోతోందట. ఈ సినిమా అధికారిక విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. రూపక్ రోనల్డ్ సన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

సంపూర్ణేష్ బాబు ముందు సినిమాల లాగానే ఈ సినిమా కూడా ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

First Published:  10 May 2019 3:33 AM GMT
Next Story