మొదటి సినిమా హిట్…. కానీ వెయిటింగ్ తప్పట్లేదు

ఆర్ఎక్స్ 100 సినిమా తో దర్శకుడి గా సినిమా పరిశ్రమ లో అరంగేట్రం చేసిన అజయ్ భూపతి మొదటి సినిమా తో నే తన ప్రతిభని చాటుకున్నాడు. ప్రేక్షకులు మెచ్చే చిత్రం తో పాటు గా బాక్స్ ఆఫీస్ దగ్గర సైతం కాసులు కురిపించే సినిమా చేసి అందరినీ మైమరిపించాడు అజయ్ భూపతి.

అయితే, తాజా సమాచారం మేరకు మొదటి సినిమా తో ఘన విజయం సాధించినా కానీ ఆయన ఇంకా తన రెండో సినిమా ని మొదలు పెట్టలేదు. చాలా మంది హీరోల తో సినిమా తీయనున్నాడు అనే వార్తలు వచ్చినా కానీ అవేమి పట్టాలెక్కలేదు.

అయితే ఇటీవల మాత్రం అజయ్ తన రెండో సినిమా ని నాగ చైతన్య- సమంత ల తో చేయనున్నాడు అనే వార్తలు వచ్చాయి. ఇందులో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నాడు అనే విషయం కూడా బయటకు వచ్చింది.

కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా మొదలు అవ్వడానికి ఇంకా చాలా టైం పట్టేలా ఉందట. ప్రస్తుతం చైతు వేరే ప్రాజెక్ట్స్ ని పూర్తి చేసే పని లో ఉండడం వలన ఈ సినిమా ని ఎప్పుడు మొదలు పెట్టాలో ఇంకా నిర్ణయించుకోలేదు అని సమాచారం. అందుకే ఈ సినిమా మొదలు కావడానికి చాలా సమయం ఉంది. సో అజయ్ కి వెయిటింగ్ మోడ్ తప్పేలా లేదు!