Telugu Global
NEWS

ఏపీ ఫలితాల ఎఫెక్ట్.... చంద్రబాబు ఆ ఊసే లేదు....

మహానాడు.. ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 28న నిర్వహించే ఈ పండుగ టీడీపీకి అతిపెద్దది. ప్రతీ సంవత్సరం మూడు రోజుల పాటు టీడీపీ నాయకులంతా అంగరంగ వైభవంగా మహానాడును నిర్వహిస్తారు. కానీ ఈసారి ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ కు మహానాడు ఊసే లేకుండా పోయింది. ఫలితాలు మే 23న వెలువడుతాయి. పైకీ ధీమాగా కనిపిస్తున్నా.. ఏపీలో వైసీపీ గాలి వీచిందన్న అంచనాతో అదే భయంతో టీడీపీ అధినేత చంద్రబాబు, సీనియర్ నేతలు భయం భయంగా ఉన్నారు. అందుకే […]

ఏపీ ఫలితాల ఎఫెక్ట్.... చంద్రబాబు ఆ ఊసే లేదు....
X

మహానాడు.. ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 28న నిర్వహించే ఈ పండుగ టీడీపీకి అతిపెద్దది. ప్రతీ సంవత్సరం మూడు రోజుల పాటు టీడీపీ నాయకులంతా అంగరంగ వైభవంగా మహానాడును నిర్వహిస్తారు. కానీ ఈసారి ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ కు మహానాడు ఊసే లేకుండా పోయింది.

ఫలితాలు మే 23న వెలువడుతాయి. పైకీ ధీమాగా కనిపిస్తున్నా.. ఏపీలో వైసీపీ గాలి వీచిందన్న అంచనాతో అదే భయంతో టీడీపీ అధినేత చంద్రబాబు, సీనియర్ నేతలు భయం భయంగా ఉన్నారు. అందుకే ఫలితాల టెన్షన్ తో మహానాడు ఊసే వారు ఎత్తడం లేదు.

ప్రతి సంవత్సరం నెలరోజుల ముందే మహానాడుపై సమీక్షలు, ఏర్పాట్లపై చంద్రబాబు సమాలోచలను చేసేవారు. కానీ ఈసారి ఆ ఊసే లేకుండా పోయింది. ఫలితాల తర్వాత హంగ్ వచ్చినా.. తేడా కొట్టినా చోటు చేసుకునే రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే ఈసారి మహానాడు నిర్వహిద్దామా లేదా అన్న సందిగ్ధంలో చంద్రబాబు ఉన్నాడని వార్తలొస్తున్నాయి.

అయితే సీనియర్లు మాత్రం పార్టీ మే 23న గెలిచినా.. ఓడినా.. ఎన్టీఆర్ పుట్టినరోజున పండుగ మహానాడును ఘనంగా నిర్వహించాలని కోరుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఈసారి మే 28న ఒక్కరోజుకే పరిమితం చేసేలా కనిపిస్తున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో రాజకీయాలు చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

First Published:  11 May 2019 1:21 AM GMT
Next Story